జాతీయ వార్తలు

రాకెట్ ప్రయోగాలకు గుండెకాయ శ్రీహరికోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 23: ఒకప్పుడు చిరుదీవిగా ఉన్న శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు స్పేస్ పోర్టుగానే కాకుండా రాకెట్ ప్రయోగాలకు గుండెకాయలా మారింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి పేరుప్రతిష్టలు తెచ్చిపెడుతోంది. బంగాళాఖాతం సముద్ర మట్టానికి ఏటవాలుగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని రాకెట్ ప్రయోగాలకు అనువైనదని 1971లో అప్పటి అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఎంపిక చేశారు. 1979లో షార్ కేంద్రం నుండి తొలిసారిగా ఎస్‌ఎల్‌వి-3 రాకెట్‌ను ప్రయోగించారు. అప్పటి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఎఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 వంటి భారీ ప్రయోగాలు చేపట్టి విజయాలు సాధించారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా షార్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, ఒక వాహక అనుసంధాన భవనం ఉంది. దీంతో మరో వాహక అనుసంధాన భవనం నిర్మాణం తుది దశకు చేరుకొంది. ఇదే కాకుండా రాకెట్ గమనాన్ని తెలిపే మల్టీ ఆఫ్‌జెట్ రాడార్ కేంద్రం, అధునాతన వసతులతో కూడిన మిషన్ కంట్రోల్ సెంటర్, ఘన ఇంధనం తయారు చేసే ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు ప్రయోగాలు చేపట్టే వారు నేడు 6నుండి 9ప్రయోగాలు చేపట్టే స్థాయికి షార్ కేంద్రం ఎదిగింది. భవిష్యత్‌లో ఏడాదికి 10నుండి 12ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో షార్‌లోనే మూడో ప్రయోగ వేదిక కూడా నిర్మించేందుకు కూడా నివేదికలు సైతం కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు.