జాతీయ వార్తలు

‘లంచాల కేసు’ను కొట్టివేసిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఓ కేసులో నిందితులకు ‘అనుకూల తీర్పు’ కోసం న్యాయమూర్తుల పేరిట లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. న్యాయమూర్తులకు లంచాల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారించాలన్న వ్యాజ్యాలను త్రోసిపుచ్చడమే గాక పిటిషనర్లను సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా మందిలించింది. ఇలాంటి కేసులతో మొత్తం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి పూర్వపరాలిలా ఉన్నాయి. లక్నోకి చెందిన వైద్య కళాశాలలో ప్రవేశాల నిషేధంపై కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదాన్ని అక్రమ మార్గంలో పరిష్కరించేందుకు ప్రయత్నాంచారనే అభియోగంపై ఒడిశాకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇస్రాత్ మస్రూర్ ఖుద్దిసీని సిబిఐ అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పేరిట లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో న్యాయవాది కామినీ జైశ్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించి, లంచాల ఆరోపణలపై దర్యాప్తునకు ‘సిట్’ ఏర్పాటు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై గత కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాల మధ్య విచారణ జరిపిన అనంతరం మంగళవారం నాడు ఈ కేసును ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పును ప్రకటించింది.