జాతీయ వార్తలు

ఆయుష్మాన్ భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారతీయులకు ఓ తీపి కబురు. 1990నుంచీ జీవన ప్రమాణ అంచనా పదేళ్లకుమించి పెరిగినట్టు అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. కానీ, ఈ జీవన ప్రమాణకాలంలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని లానె్సట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. లానె్సట్ నివేదిక ప్రకారం మహిళల జీవన ప్రమాణం ఉత్తరప్రదేశ్‌లో 66.8 ఏళ్లుంటే, కేరళలో 78.7 సంవత్సరాలుగా ఉంది. 134 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే ఐదోస్థానంలోవున్న భారతీయుల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర విశే్లషణతో అధ్యయనం జరపడం ఇదే ప్రథమం. జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి కీలకాంశాలైన అనారోగ్యం, అంగవైకల్యం, అకాల మరణాలను పరిగణనలోకి తీసకుని 29 రాష్ట్రాల్లో రెండువేల జాతులకు సంబంధించిన ప్రజల ఆయుఃప్రమాణాలపై అధ్యయనాలు జరిపారు. ప్రగతిస్థాయి, ప్రజల సాంక్రమిక ఆరోగ్య జీవన ప్రమాణ మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించి అధ్యయనాలు జరిపామని అధ్యయనవేత్తలు తెలిపారు. అనారోగ్యం, అకాల మరణాలు, ప్రసూతి మరణాలు, పౌష్టికాహారలోపం కారణంగా సంభవించే మరణాలు, అకస్మాత్తుగా సంభవించే మరణాల నిష్పత్తితో సరిపోల్చి ఈ అధ్యయనం జరిపినట్టు చెబుతున్నారు. ‘్భరత్‌లో రాష్ట్రాల మధ్య వైవిధ్యం ఉంది. దాని కారణంగా సాంక్రమిక జీవన ఆయు ప్రమాణంలోనూ మార్పులు ద్యోతకమయ్యాయి. ఇదే రాష్ట్రాల మధ్య జీవన ప్రమాణంలో వ్యత్యాసానికి కారణంగా భావిస్తున్నాం’ అని గుర్‌గ్రామ్‌లోని భారత ప్రజారోగ్య వ్యవస్థ ప్రతినిధి లలిత్ దండోనా వ్యాఖ్యానించారు. ‘అందరికీ ఆరోగ్యం అంటున్న ప్రభుత్వ దృష్టికోణానికి మా అధ్యయనం దగ్గరిగాను, హితోక్తంగానూ ఉంటుందనే అనుకుంటున్నాం’ అని దండోనా వ్యాఖ్యానించారు. 1990ల్లో అనేక వ్యాధుల కారణంగా సంభవించిన మరణాల కంటే 2016లో సంభవించిన మరణాల సంఖ్య మూడొంతులు తగ్గినట్టు తేలింది.