జాతీయ వార్తలు

నిధులు పుష్కలం..తగ్గని కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారణకు దండిగా నిధులున్నా కార్యాచరణ మాత్రం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. వాయు కాలుష్యంపై పోరాడేందుకు ఢిల్లీలో అధికార యంత్రాంగం ‘హరిత నిధి’ పేరిట సుమారు 1,500 కోట్ల రూపాయలను సమీకరించింది. నిధులను చాలావరకూ ఖర్చు చేయకపోవడంతో ఢిల్లీ వాసులు విషతుల్యమైన కాలుష్యంతో విలవిలలాడుతున్నారు. ‘హరిత నిధి’ కింద జమ అయిన నిధుల్లో సింహభాగం అంటే- 1,003 కోట్ల రూపాయలు ‘వాతావరణ నష్టపరిహార పన్ను’ (ఇసిసి) కింద సమకూరినవే. 2015లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ఫలితంగా ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కుల నుంచి ఈ సెస్సును వసూలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి లీటర్ డీజిల్ విక్రయంపైనా 2008 నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. డీజిల్ వాహనాలను విక్రయించే డీలర్ల నుంచి ఒక శాతం సెస్సు కింద ‘కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు’ (సిపిసిబి) వసూలు చేసిన 62 కోట్ల రూపాయల మొత్తం కూడా ‘హరిత నిధి’కి తోడైంది. గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దేశ రాజధాని ప్రాంతంలో డీజిల్ వాహనాల విక్రేతల నుంచి సిపిసిబి ఈ సెస్సును వసూలు చేస్తోంది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ‘వాతావరణ నష్టపరిహార సెస్సు’ను వసూలు చేసి నగర రవాణా విభాగానికి ప్రతి శుక్రవారం అందజేస్తోందని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ (సిఎస్‌ఇ)కి చెందిన పరిశోధకుడు ఉస్మాన్ నసీమ్ చెబుతున్నారు.
డీజిల్ వాహనాలపై పన్ను వసూలు చేయాలని 2007లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నిర్ణయించారు. ఇలా వసూలు చేసిన మొత్తాలన్నీ ‘్ఢల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ’ అధీనంలో ఉన్నాయి. ఏళ్ల తరబడి వసూలు చేసిన పన్నులతో డిపిసిసి వద్ద ప్రస్తుతం 500 కోట్ల రూపాయల నిధులున్నాయి. కాగా, ఈ నిధుల నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు కొంత మొత్తాన్ని వినియోగిస్తామని ఢిల్లీ రవాణా విభాగంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ సర్కారు మంగళవారం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాలని భావిస్తున్నా, ఏ మేరకు ఎలక్ట్రిక్ బస్సులు కొనాలన్నది ఇంకా ఖరారు కాలేదు. అలాగే, ‘పర్యావరణ నష్టపరిహార చార్జీల’ కింద జమ అయిన నిధి నుంచి 120 కోట్ల రూపాయలను ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ పరికరాల కొనుగోలుకు ఖర్చు చేయాలని, ట్రక్కుల నుంచి సెస్సు వసూలుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు. పర్యావరణ సమస్యలను అధ్యయనానికి భారీగా నిధులను ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. కాలుష్య నియంత్రణకు అవసరమైన పరికరాలను 2.5కోట్లతో కొనాలని భావించారు. ఆ ప్రతిపాదనలన్నీ ఏళ్ల తరబడి కార్యరూపం దాల్చడం లేదన్నది నిజం. ప్రజారోగ్యంపై కాలుష్యం ప్రభావంపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్న ప్రతిపాదనలు యథాతథంగానే ఉన్నాయి.