జాతీయ వార్తలు

భూ కబ్జా ఆరోపణలతో కేరళ మంత్రి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 15: భూకబ్జా ఆరోపణలు నేపథ్యంలో కేరళ రవాణా శాఖ మంత్రి థామస్ చాందీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అలప్పుఝా జిల్లాలో భూకబ్జాలో మంత్రికి సంబంధించిన కంపెనీ ప్రమేయం ఉందని కలెక్టర్ నివేదించారు. దీన్ని మంత్రి చాందీ హైకోర్టులో సవాల్ చేసి భంగపడ్డారు. ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రవాణా మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. వామపక్ష ఎల్‌డిఎఫ్ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో రాజీనామా. విజయన్ కేబినెట్‌లో ఇంతకుముందు ఇద్దరు మంత్రులు వివిధ కారణాలతో రాజీనామా చేశారు. ఎన్‌సిపికి చెందిన మంత్రి ఏకే శశిధరన్ ఓ మహిళతో జరిపిన సంభాషణ ఆడియోటేప్ బయటపడడంతో రాజీనామా చేశారు. తరువాత తన బంధువులకు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు నేపథ్యంలో మరో మంత్రి ఇపి జయరాజన్ (సిపిఎం) రాజీనామా చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాందీ మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. శశిధరన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చాందీని కేబినెట్‌లోకి తీసుకున్నారు. 8 నెలల క్రితమే కేబినెట్‌లోకి వచ్చిన థామస్ చాందీపై భూకబ్జాల ఆరోపణలు వచ్చాయి.