జాతీయ వార్తలు

రామమందిరానికి ముస్లింలు వ్యతిరేకం కాదు: రవిశంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 16: అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని ముస్లింలలో అత్యధిక సంఖ్యాకులు వ్యతిరేకించడం లేదని ప్రముఖ ఆథ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. మందిరం నిర్మిస్తే ‘కొంతమంది’కి మాత్రం ఇష్టం ఉండదని తనకు తెలుసునని, దాదాపు ముస్లింలంతా ఇందుకు సానుకూలమేనని ఆయ న తెలిపారు. ‘రామ్ మందిర్- మసీ దు వివాదం’పై ఉభయ వర్గాలతో చర్చించేందుకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడైన రవిశంకర్ గురువారం ఇక్కడికి వచ్చారు. ఈ వివాదానికి పరిష్కారం అసాధ్యమని ఒక్కోసారి అనిపిస్తుందని, అయితే యువకులు, ఉభయ మతాల నాయకులు తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదన్నారు. వచ్చే నెల 5వ తేదీన అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు విచారణ జరుపనున్న నేపథ్యంలో రవిశంకర్ ఇక్కడ పర్యటించడం గమనార్హం. మధ్యవర్తిగా చర్చలు ఇపుడే ప్రారంభించానని, వెంటనే ఓ నిర్ధారణకు రావడం సరికాదన్నారు. ‘వాతావరణం చాలా ఆశాజనకంగా ఉంది.. ఈ వివాదం నుంచి బయటపడాలని ఇక్కడి జనం భావిస్తున్నారు.. అయితే ఇది అంత సులువు కాదు.. ప్రతి ఒక్కరితో ముందుగా చర్చించాలి..’ అని ఆయన అన్నారు. అయోధ్య వివాదంపై ఉభయ వర్గాలతో చర్చలు జరపాలని రవిశంకర్ ఇటీవల ప్రతిపాదించారు. ఓ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిపిన సమావేశంలో ఆయన ఈ వివాదాన్ని ప్రస్తావించారు. ఇందుకు తన వద్ద నిర్దిష్టమైన ఎజెండా ఏదీ లేదని, ప్రతి ఒక్కరు చెప్పేది వినాల్సి ఉంటుందన్నారు.
రవిశంకర్ అయోధ్య పర్యటనను భారతీయ జనతాపార్టీ స్వాగతించగా, విపక్షాలు వ్యతిరేకించాయి. అయోధ్యలో పర్యటనకు ముందు రవిశంకర్ బుధవారం నాడు లక్నోలో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

చిత్రం..గురువారం అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించిన రవిశంకర్