జాతీయ వార్తలు

స్టింగ్ ఆపరేషన్ కేసులో రావత్ అరెస్టుపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్, మే 31: స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సీడీ కేసులో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అరెస్టుపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ అంశంపై జూన్ 20వ తేదీన తదుపరి విచారణ జరుపనుంది. రావత్‌కు ప్రమేయం ఉన్న స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) గత వారం ఆయనను ప్రశ్నించిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తునకు రాష్టప్రతి పాలన సమయంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సిబిఐ తిరస్కరించడంతో రావత్ బలవంతంగా విచారణకు హాజరుకావలసి వచ్చింది. రావత్ విజ్ఞప్తి మేరకు సిబిఐ దర్యాప్తుపై ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా స్టే విధించలేదు. మే 9వ తేదీన విచారణకు హాజరు కావాలని రావత్‌కు సిబిఐ సమన్లు జారీ చేయగా, అందుకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో రావత్ విజయం సాధించి మళ్లీ అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. స్టింగ్ ఆపరేషన్‌తో తనకు సంబంధం లేదని, అది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు విడుదల చేసిన నకిలీ వీడియో అని అంతకుముందు చెప్పిన రావత్ ఆ తర్వాత స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించారు. బలపరీక్షలో రావత్ విజయం సాధించిన తర్వాత మే 15వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై స్టింగ్ ఆపరేషన్‌పై సిబిఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తూ అంతకుముందు జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే కేసు అయినందున దీనిపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేయాలని రావత్ మంత్రివర్గం నిర్ణయించింది.