జాతీయ వార్తలు

అందరూ హిందీ నేర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 19: ‘ భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి భాష ఉపయోగపడుతుంది..’ అని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద 16వ స్నాతకోత్సవంలో ఉప రాష్టప్రతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ 1935 సంవత్సరంలో విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ స్థాపించడం జరిగిందన్నారు. తద్వారా అధ్యాపకులు, ప్రచారకులు తయారయ్యారని ఆయన తెలిపారు. హిందీ ప్రచారం సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వివరించారు. దేశంలో ఎక్కువగా హిందీ మాట్లాడే వారున్నారని, రాని వారూ త్వరగా అర్థం చేసుకోగలరని అన్నారు. హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తల్లిలాంటి మాతృ భాషను ప్రేమిస్తూనే ఇతర భాషలను నేర్చుకోవాలని అన్నారు. మాతృ భాష కళ్లలాంటిదని, ఇతర భాషలు కళ్లజోళ్లవంటివని ఆయన తెలిపారు. కళ్లు లేనిదే కళ్లజోళ్ల వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని మన మాతృ భాష అయిన తెలుగుకు తొలి ప్రాధాన్యతనిచ్చి, ఆ తర్వాత జాతీయ భాష అయిన హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. ఉద్యోగ, ఉపాది కోసం ఏ బాష నేర్చుకున్నా వాటి మాయలో పడవద్దని, రష్యా, ఫ్రెంచ్, చైనా దేశాల అధ్యక్షులు వారి జాతీయ భాషలోనే మాట్లాడతారని ఆయన ఉదహరించారు. ఇతర దేశాల భాషలపై అవసరానికి మించి మోజు పెంచుకోవడం అనర్ధదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిభా పాటవాలను అభివృద్ధి చేసుకుంటూ జీవితంలో ఎదగాలని సూచించారు. చిన్న విషయాలకు కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం శక్తితో పైకి ఎదిగి ఇతరులకు మార్గదర్శకులుగా మారాలని ఆయన తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా మనమంతా భారతీయులుగా మెలగాలని అన్నారు. హిందీ భాషాభివృద్ధికి దక్షణ భారత హిందీ ప్రచార సభ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైస్ చాన్సలర్ హనుమంతప్ప, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.