జాతీయ వార్తలు

చెయ్యెత్తి.. జైకొట్టారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: వారసత్వ రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (47)ని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూలును ఖరారు చేశారు. రాహుల్‌ను కాంగ్రెస్ బాస్‌గా ఎన్నుకునే విషయం డిసెంబర్ 4న నామినేషన్ ఆఖరు రోజే స్పష్టమైపోతున్నా, డిసెంబర్ 19న అధికారికంగా అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు. కాంగ్రెస్‌కు 17ఏళ్లపాటు నాయకత్వం వహించిన సోనియాగాంధీ, ఆ రోజున రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అధ్యక్షతన సోమవారం ఉదయం ఆమె నివాసంలో జరిగిన సిడబ్ల్యుసి భేటీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూలు ఖరారైంది. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ ఇప్పటికే అన్ని పీసీసీలు ఏకగ్రీవ తీర్మానం చేసి సోనియాకు పంపటం తెలిసిందే.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు డిసెంబర్ 4న తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీపై పోటీ చేసేందుకు ఎవరైనా రంగంలోకి దిగితే డిసెంబర్ 16న ఎన్నిక నిర్వహించి 19న ఫలితం ప్రకటిస్తారు. రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటూ అన్ని పీసీసీలూ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ జరగటం దాదాపుగా అసాధ్యం. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కమిషన్ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ సోమవారం ఏఐసిసి కార్యాలయంలో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూలు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు సంబందించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్ 1న జారీ చేస్తారు. డిసెంబర్ 4న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 5న నామినేషన్ల పరిశీలన, 11న ఉపసంహరణ ఉంటుంది. పోలింగ్ అవసరమైతే డిసెంబర్ 16న నిర్వహించి 19న ఫలితాలు ప్రకటిస్తారని రామచంద్రన్ వివరించారు.
పదిహేడేళ్ల క్రితం సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావటం అందరికీ తెలిసిందే. సోనియా బాటలో రాహుల్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని సోమవారం జరిగిన సిడబ్ల్యుసి భేటీలో పలువురు సీనియర్లు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.
మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, హోం శాఖ మాజీ మంత్రి పి చిదంబరం, పార్టీ సీనియర్ నాయకుడు, జమ్ము కాశ్మీర్ మాజీ మహారాజు డాక్టర్ కరణ్‌సింగ్, ఏకే ఆంటోని తదితరులంతా కూడా రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించటం తెలిసిందే. అయితే సీనియర్ నేతలతో వచ్చిన విభేదాల మూలంగా రాహుల్ ఎన్నిక వాయిదా పడుతూవచ్చింది. ఇప్పుడు సోనియా ఆరోగ్యం
బాగా దెబ్బతినటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్‌కు పట్టంకడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాహుల్ చేపట్టటాన్ని సీనియర్లు వ్యతిరేకించ లేదు. కానీ ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సీనియర్ నేతలందరికీ ఉద్వాసన పలుకుతాడనేది ప్రచారం కావటంతో కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. సోనియా గాంధీ జోక్యం చేసుకుని ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత అన్ని కీలక పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పుంజుకోవాలంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వక తప్పదనేది రాహుల్‌కి బాగా తెలుసునని వారంటున్నారు. సోనియా గాంధీ చుట్టూవున్న సీనియర్లకు రాహుల్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని వాదిస్తున్నారు. రాహుల్ కేవలం యువకు పెద్ద పీట వేస్తారా? లేక యువతతో పాటు సీనియర్ నాయకులకూ సముచిత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా అందరిని కలుపుకుపోతారా? అనేది వేచి చూడాల్సిన విషయం.
గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం ప్రాధాన్యత సంతరించుకున్నది. గుజరాత్ శాసన సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 9 తేదీ, రెండో విడత పోలింగ్ 14 తేదీ జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు తమ నామినేషన్లను డిసెంబర్ 4లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీపై పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే డిసెంబర్ 4నాడే రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు. రామచంద్రన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పార్టీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 19న ముగుస్తుంది కాబట్టి రాహుల్ ఆ రోజు పార్టీ అధ్యక్ష పదవికి అధికారింగా ఎన్నికైనట్టు అవుతుంది.
*
నీడయె కాంగ్రెస్‌కెప్పుడు
వీడని నేతృత్వమిచ్చి వెలుగులు నింపెన్
నాడైనా రేపైనా
నీడయె నిజమగుటజూసి నివ్వెరపోకుమ్!