జాతీయ వార్తలు

గుజరాత్‌లోనూ ‘పద్మావతి’పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, నవంబర్ 22: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ కూడా పద్మావతి సినిమాను నిషేధించింది. ఇప్పటికే ఈ సినిమాను నిషేధించిన రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానే్న మూడో బిజెపి పాలిత రాష్టమ్రైన గుజరాత్ కూడా అనుసరించింది. ‘పద్మావతి సినిమా విడుదలను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. ఈ సినిమా నిర్మాణంతో రాజ్‌పుత్‌ల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చరిత్ర వక్రీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామని, అలాగని సంస్కృతితో ముడిపడిన అంశాల విషయంలో కుట్రలను ఎంతమాత్రం సహించేది లేదు’ అని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బుధవారం స్పష్టం చేశారు. రాజ్‌పుత్‌ల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం, ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ చిత్రం రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, గుజరాత్‌లో 22 ఏళ్లుగా అధికారంలో వున్న బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. ఒకపక్క ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో గుజరాత్ ప్రభుత్వం పద్మావతి సినిమాపై కీలక నిర్ణయం తీసుకుంది.
‘మహారాష్టల్రోనూ నిషేధించండి’
పద్మావతి సినిమాపై మహారాష్టల్రోనూ నిషేధం విధించాలని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైకుమార్ రావల్ ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. చరిత్రను వక్రీకరించిన పక్షంలో ఈ సినిమాపై తక్షణం నిషేధం విధించాలని ఆ లేఖలో రావల్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు సెంట్రల్ ఫిలిమ్ సెన్సార్‌బోర్డుకు కూడా లేఖ రాసిన ఆయన, చరిత్రకారులతో కూడిన కమిటీ ముందు ఈ సినిమా ప్రదర్శించాలని, చరిత్రను వక్రీకరించిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు.