జాతీయ వార్తలు

కన్నడం నేర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 31: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కర్నాటక నుంచి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు చివరిరోజు మంత్రి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అవుట్‌సైడర్ అన్న విమర్శలపై ఆమె స్పందించారు.‘కర్నాటక ప్రాజెక్టుల పరిరక్షణకు కృషి చేస్తాను. అంతేకాదు కన్నడం నేర్చుకుంటాను’అని సీతారామన్ హామీ ఇచ్చారు. కర్నాటకకు సంబంధించిన అంశాలు పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు.‘బిజెపి కార్యకర్తగా నామినేషన్ వేశాను. యెడ్యూరప్ప, అనంతకుమార్ తదితరుల సహకారంతో రాజ్యసభకు ఎన్నికవుతానన్న విశ్వాసం ఉంది’అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోనని ఆమె పేర్కొన్నారు. నిర్మాలా సీతారామన్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్, శాసనసభలో ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టార్ తదితరులున్నారు. ‘కన్నడం నాకు కొంచెం వచ్చని, ఇంకా బాగా నేర్చుకుంటాను’అని ఆమె అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడిని కర్నాటక నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని బిజెపి అధిష్ఠానం భావించినా కన్నడ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఆయన స్థానంలో నిర్మలాసీతారామ్‌ను ఎంపిక చేశారు. వెంకయ్యనాయుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు.

చిత్రం మంగళవారం బెంగళూరులో రాజ్యసభ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్