జాతీయ వార్తలు

ఈపీఎస్-ఓపీఎస్ వర్గానికే ‘రెండాకులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/న్యూఢిల్లీ, నవంబర్ 23: అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ‘రెండాకుల గుర్తు’పై కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గురువారం స్పష్టతనిచ్చింది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి ఇకే పళనిస్వామి- ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం వర్గానికే ఈ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అన్నాడిఎంకె పార్టీలోను, శాసనసభలోను ఇపీఎస్-ఓపీఎస్ వర్గానికే మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నందున వీరికే ‘రెండాకుల గుర్తు’ను కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. కాగా, పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో శశికళ వర్గానికి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.
జయలలిత మరణంతో అన్నాడిఎంకేలో ఆధిపత్య పోరాటం మొదలైన సంగతి తెలిసిందే. శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు తొలుత అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. సిఎం పదవి నుంచి పన్నీర్‌ను తప్పించాక అనూహ్య పరిణామాల నేపథ్యంలో పళని స్వామి అధికారం చేపట్టారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లాక ఓపీఎస్, ఇపీఎస్ వర్గాలు ఒక్కటయ్యాయి. శశికళ మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ‘రెండాకుల గుర్తు’ కోసం శశికళ వర్గం, ఇపీఎస్- ఓపీఎస్ వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఆ గుర్తును తమకే కేటాయించాలని ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి దినకరన్ పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నెలల తరబడి ఏ నిర్ణయం తీసుకోకుండానే ‘రెండాకుల గుర్తు’ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. అయితే అనూహ్యంగా ఈపీఎస్-ఓపీఎస్ వర్గానికే పార్టీ గుర్తు చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఈపీఎస్-ఓపీఎస్ వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇ.మధుసూదన్, ఈపీఎస్, ఓపీఎస్ తదితర నాయకులున్న పార్టీనే అన్నాడిఎంకెగా ఈసీ గుర్తించింది.
ఎన్నికల సంఘం నిర్ణయం తమ పార్టీలో ఆనందాన్ని నింపిందని ముఖ్యమంత్రి పళనిస్వామి అభివర్ణించారు. అన్నాడిఎంకె ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరిపారు. జయలలిత మృతి వల్ల ఆర్కే నగర్ ఉపఎన్నిక త్వరలో జరుగనున్న నేపథ్యంలో ‘రెండాకుల గుర్తు’పై ఈసీ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఉపఎన్నికలో ఇక తమదే గెలుపు అని ఈపీఎస్- ఓపీఎస్ బృందం భావిస్తోంది. ‘రెండాకుల గుర్తు’ కోసం మొదట శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడ్డాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి అప్పట్లో శశికళ గ్రూపులో ఉన్నారు. పార్టీ గుర్తును స్తంభింపజేస్తూ గత మార్చిలో ఈసీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇలావుండగా, పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని శశికళ వర్గానికి చెందిన దినకరన్ గురువారం విలేఖరులకు తెలిపారు.

చిత్రం..రెండాకుల గుర్తు దక్కించుకున్న ఓ.పన్నీర్‌సెల్వం, పళనిస్వామి