జాతీయ వార్తలు

నలుగురేసి పిల్లల్ని కనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడిపి (కర్నాటక), నవంబర్ 25: దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలు చేసే వరకూ ప్రతి హిందువూ కనీసం నలుగురు పిల్లలను కనాలని, జనాభా అసమతుల్యతను నివారించేందుకు ఈ విధానాన్ని పాటించాలని హరిద్వార్‌కు చెందిన స్వామి గోవిందదేవ్ గిరీజీ మహరాజ్ పిలుపునిచ్చారు. ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలన్న నిబంధనను హిందువులకు మాత్రమే వర్తింపచేయరాదన్నారు. దేశంలో క్రమంగా హిందువుల సంఖ్య తగ్గుతున్నందున జనాభా అసమతుల్యతకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటకలోని ఉడిపిలో మూడురోజుల ‘్ధర్మ సంసద్’ సదస్సు సందర్భంగా భారత్ మఠ్ మందిర్ (హరిద్వార్) అధిపతి స్వామి గోవిందదేవ్ శనివారం ప్రసంగించారు. ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలని చెబుతున్న ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల వల్ల హిందువుల జనాభా తగ్గుతోందని, ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రతి హిందువూ కనీసం నలుగురు పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, గోసంరక్షకుల ముసుగులో కొందరు నేరస్థులు అకృత్యాలకు పాల్పడుతూ హిందూ మతంపై వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఉడిపిలో జరుగుతున్న ‘్ధర్మ సంసద్’ సదస్సుకు దేశం లేని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు, విశ్వహిందూ పరిషత్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.