జాతీయ వార్తలు

ట్రాఫిక్ పోలీసు అతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్యాకుమారి, నవంబర్ 25: మోటర్ సైకిల్‌పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడిని అడ్డుకోబోయి అతడిని గాయాలపాలు చేసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కల్లూపురం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాకేష్ అనే పాతికేళ్ల యువకుడు స్నేహితుడితో కలిసి బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు. బైక్ నడుపుతున్న అతడికి హెల్మెట్ కూడా లేదు.దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. చేతిలో ఉన్న లాఠీని అడ్డుగా పెట్టడంతో బైక్‌పై వెళ్తున్న వారు కిందపడిపోయారు. ఈ ఘటనలో రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దృశ్యం సీసీటీవీలో వైరల్ అయింది. ఈ సంఘటన చూసి కోపోద్రేకులైన స్థానికులు ఆందోళనకు దిగారు. గాయపడ్డ రాకేష్‌ను ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ చిత్రాలు స్థానిక చానళ్లలోనూ ప్రసారం కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై వేటు పడింది.