జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రజాస్వామ్యంలో బౌతిక దాడులకు, హింసకు తావులేదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. సినిమాలు, కళలు దేశంలో చట్ట నియమాలను తక్కువచేసి చూపకూడదని అన్నారు. పద్మావతి చిత్రం వివాదం గురించి ప్రస్తావించకుండా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఢిల్లీలో ఓ సాహితీ సమ్మేళనంలో ఉపరాష్టప్రతి మాట్లాడుతూ ‘సినిమాలకు సంబంధించి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. తమ సెంటిమెంట్లను అవమానిస్తున్నారని కొందరు, తమ మతాన్ని కించపరుస్తున్నారని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. చివరికి నిరసనలకు దారితీస్తున్నాయి’అని అన్నారు. కొందరయితై తలలకు వెల కడుతున్నారని ఆయన విమర్శించారు. హెచ్చరికలు చేస్తున్న వారి వద్ద అంత డబ్బు ఉందా? అన్నది అనుమానమేనని ఉప రాష్టప్రతి స్పష్టం చేశారు. ఒకరయితే కోటి రూపాయల రివార్డు ప్రకటిస్తున్నారన్న ఉపరాష్టప్రతి ‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి హెచ్చరికలు, చర్చలకు తావులేదు’అని అన్నారు.‘ ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిజేసే హక్కు అందిరికీ ఉంది. అది సరైన పద్ధతిలో తెలపవచ్చు. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే విపరీత పరిణామాలకు దారితీస్తుంది’అని వెంకయ్యనాయుడు అన్నారు. కిస్సా కుర్సికా, ఆంధీ, గరమ్ హవా చిత్రాల వివాదం ఈ సందర్భంగా ప్రస్తావించారు. పద్మావతి చిత్ర నిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని బెదిరిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉపరాష్టప్రతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి చరిత్రకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొన్ని సంస్థల భన్సాలీ, నటి దీపికా పదుకొనె తలలకు రివార్డు ప్రకటించాయి.‘చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే అధికారం మీకులేదు. అలాగే ప్రజల సెంటిమెంట్‌ను కించపరచే అధికారం మరొకరికి ఉండకూడదు’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
పార్లమెంటు పనిదినాలే ప్రధానం
పార్లమెంటు సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయన్నది ప్రధానం కాదని, ఎన్ని రోజులు పని జరిగిందన్నదే ముఖ్యమని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను జాప్యం చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శించాక సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఉప రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ (సిసిపిఎ) హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం భేటీ అయ్యాక పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలని సిసిపిఎ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఇక్కడ జరిగిన ఓ సాహితీ సమావేశంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చ జరగాలన్నారు. ‘పార్లమెంటు ఎన్ని రోజులు భేటీ అయిందన్న విషయం కన్నా, ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? ఎన్ని రోజులు పని జరిగింది? అన్నదే ప్రధానం’ అని అన్నారు. వ్యక్తిత్వం, నైపుణ్యం, ప్రవర్తన, కరుణ వంటి అంశాలపైనే జీవన విధానం ఉండాలన్నారు. కులం, మతం, డబ్బు వంటివి ప్రాతిపదిక కారాదన్నారు. సాహిత్యం సమాజానికి వెనె్నముక వంటిదన్నారు. కాళిదాసు నుంచి ప్రేమ్‌చంద్ వరకూ, రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఇప్పటి తరం వరకూ ఎంతోమంది రచయితలు, కవులు సమాజాన్ని ప్రభావితం చేశారని, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేలా కృషి చేశారని ఆయన కొనియాడారు. సామాజిక చైతన్యం, రాజకీయాలు, యువశక్తి, పౌరుల చురుకుదనం నేడు కొత్త ఆవిష్కరణలకు దారిచూపుతున్నాయన్నారు. కుహనా రాజకీయవాదులు ఇకనైనా కులం, మతం, డబ్బు ప్రభావాల నుంచి బయటపడి వ్యక్తిత్వం, నైపుణ్యం, ప్రవర్తన, కారుణ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.