జాతీయ వార్తలు

పోషకాహార లక్ష్యాలపై ఫలితాలు సాధించాలి: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: పోషకాహార లోపాన్ని నివారించేందుకు 2022 సంవత్సరంలోగా స్పష్టమైన ఫలితాలను సాధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అందరికీ పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పథకాలను ఆయన శనివారం సమీక్షించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యేనాటికి (2022) పోషకాహారంపై ఫలితాలు ఆశాజనకంగా ఉండాలన్నారు. నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయ అధికారులు, వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పోషకాహారం సమస్యపై అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధించిన విజయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
పిల్లల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, పోషకాహార లోపం వంటి సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలన్నీ కృషి చేయాలన్నారు. ఈ సమస్యలు తీవ్రంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మంచి ఫలితాలను సాధించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్, మిషన్ ఇంద్రధనుష్, బేటీ బచావ్- బేటీ పడావ్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి కార్యక్రమాల సందర్భంగా పోషకాహార సమస్యపైనా కృషి జరుగుతున్నట్లు అధికారులు మోదీకి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలను సమన్వయ పరుస్తూ పోషకాహారం సమస్యపై మంచి ఫలితాలను రాబట్టాలని ప్రధాని సూచించారు. ఈ విషయమై అవగాహన పెంచేందుకు అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలన్నారు.