జాతీయ వార్తలు

మైనర్లను రేప్‌చేస్తే మరణదండనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, నవంబర్ 26: అత్యాచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోదింది. 12 సంవత్సరాలు ఆలోపు వయస్సు కలిగిన బాలికలపై అత్యాచారం చేసే దోషులకు మరణశిక్ష విధించాలని ఆదివారం తీర్మానించింది. ఇందుకు సంబంధించి కేబినెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేరశిక్షాస్మృతిలో కొన్ని మార్పులు చేస్తూ అత్యాచార దోషులపై విధించే జరిమానాను, శిక్షాకాలాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జయంత్ మాల్యా ధృవీకరించారు. 12 సంవత్సరాలలోపు మైనర్లు, అంతకంటే వయస్సు కలిగిన వారిపై అత్యాచారం జరిపే ఏ వ్యక్తికైనా మరణశిక్ష విధిస్తామని వెల్లడించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో సభామోదానికి ఈ సవరణను నివేదిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో బాలికలు, మహిళలపై మానభంగం సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిపై ఉక్కుపాదం మోపాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర రాజధానిలో 10 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిపిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 67 సంవత్సరాల ఓ వృద్ధుడు, ఓ మహిళ కూడా ఉన్నారు.