జాతీయ వార్తలు

ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఐ పార్టీ ధ్వజమెత్తింది. రెండు రోజులపాటు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జీడీపీ రెండుశాతం తగ్గిందని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి సామాన్యులను భారంగా మారిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా దేశంలో అనేక సమస్యలుంటే పద్మావతి చిత్రాన్ని వివాదాస్పదం చేసి ప్రజా సమస్యలనుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికార అండతో బీజేపీ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని, గతంతో పోలిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, అతని కుమారుడి అస్తులు 300 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని బీజేపీ నేతలు చెప్పిన మాటలు నీటిమూటలుగా మారిపోయాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ అందోళనలు కొనసాగిస్తుందని ఆయన స్పష్ట చేశారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 8 నుంచి విజయవాడలో ప్రారంభం కానున్నయని, ఈ సమావేశాల్లో చేయాల్సిన రాజకీయ తీర్మానాలపై, దేశంలోని పరిస్థితులపై రెండు రోజుల పాటు జరిగిన కార్యవర్గ సమావేశాల్లో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.