జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై ఉక్కుపిడికిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: నాగరిక సమాజానికి పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదాన్ని ఉమ్మడి శక్తితో తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై పాక్ ఉగ్రమూకలు దాడి జరిపి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి ఆ నరమేధంలో అశువులు బాసిన పౌరుల త్యాగాలను గుర్తు చేసుకున్న ఆయన ‘ఉగ్రవాదం దయనందిన సవాల్‌గా మారింది. ప్రపంచ జాఢ్యంగా అన్ని ప్రజాస్వామ్య దేశాలను కబళిస్తోంది’ అని అన్నారు. ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి ఉమ్మడిగా ముందుకు సాగాలని, అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుని ఈ పెనుభూతాన్ని అంతం చేయాలన్నారు. కొనే్నళ్ల క్రితం ఉగ్రవాదం గురించి భారత్ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు పట్టించుకోలేదని, ఇప్పుడు అన్ని దేశాలకు ఇదో పెను సవాల్‌గా మారిందని, రోజువారీగా రక్తపాతాన్ని సృష్టిస్తోందని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్‌కి బాత్’లో మోదీ అన్నారు. మానవత్వం, ప్రజాస్వామ్యం వంటి ఉన్నత విలువలను పాటిస్తున్న దేశాలన్నింటికి ఈ తీవ్రవాద సమస్య అంతులేనిదిగా పరిణమిస్తోందని మోదీ తెలిపారు.
మొత్తం ప్రపంచ నాగరిక సమాజానికే ముప్పుగా మారిన ఈ తీవ్రవాద సమస్యను ఉమ్మడి శక్తితో ఎదుర్కోవడం ఎంతైనా అవసరమని, ఇందుకు అన్ని దేశాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ సహా మానవీయ శక్తులన్నీ ఉక్కుపిడికిలి బిగించినప్పుడే ఉగ్రవాద మూకలను తుడిచిపెట్టడం సాధ్యమవుతుందని అన్నారు. బుద్ధుడు, మహావీరుడు, గురునానక్, మహాత్ముడు జన్మించిన భారత్ దేశం అనాధిగా అహించనే ప్రపంచానికి బోధిస్తూ వచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం అని పేర్కొన్న మోది తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే రోజు పాక్ ఉగ్రవాదులు దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై దాడిచేసి
రక్తపాతం సృష్టించారన్నారు. ఆ ఉగ్రమూకలను ఎదుర్కొనే ప్రయత్నంలో జవాన్లు, పౌరులు చేసిన త్యాగాలను, కనపరిచిన ధైర్యాన్ని మరవలేమన్నారు.
రాజ్యాంగం శిరోధార్యం
దేశ ప్రజలు, పాలనా యంత్రాంగం రాజ్యాంగ నియమ నిబంధనలకు, స్ఫూర్తికి కట్టుపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎవరి మనోభావాలను ఏ విధంగానూ దెబ్బతీయకూడదన్నదే భారత రాజ్యాంగ సారమని వెల్లడించిన మోదీ ‘‘ప్రతి ఒక్కరు త్రికరణ శుద్ధిగా దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి’’ అని ఉద్ఘాటించారు. పద్మావతి చిత్రానికి సంబంధించి చెలరేగుతున్న వివాదం, అలాగే గోరక్షణ పేరిక సాగుతున్న దాడుల నేపథ్యంలో మోదీ పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిగురించి మోది ప్రత్యక్షంగా తన ప్రసంగంలో ప్రస్తావించినప్పటికి దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే స్ఫూర్తిదాయకమన్నారు. 1949లో ఇదే రోజున నాటి రాజ్యాంగ పరిషత్ దేశ రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిందిని, ఆ మరుసటి సంవత్సరం అంటే 1950, జనవరి 26న దానే్న రాజ్యాంగంగా చేపట్టడం జరిగిందన్నారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు రాజ్యాంగ పరిషత్ సభ్యులు మూడు సంవత్సరాలపాటు అహరహం శ్రమించారని గుర్తు చేసిన మోదీ ‘‘ఎన్నో వైవిధ్యాలకు భిన్నం సంస్కృతులు, భాషలకు నెలవైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంతగా శ్రమించి ఉంటారో మనం ఊహించగలమా?’’ అని మోదీ ప్రశ్నించారు. నాటి రాజ్యాంగ నిర్మాతల ఆశయాన్ని పరిరక్షిస్తూ నవభారత్ నిర్మాణ దిశగా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన అంశం ప్రతి ఒక్కరిపట్ల సమానత్వ భావనను కనపరచటమేనని, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ అందరి ప్రయోజనాలను కాపాడటమేనని తెలిపారు. పౌరులు, పాలనా నిర్వాహకులు రాజ్యాంగ స్ఫూర్తితోనే తమ బాధ్యతలను, విధులను నిర్వహించాలన్నారు. ఎవరి మనోభావాలను ఏవిధంగాను దెబ్బతీయకూడదని, అలాగే ఎవరికి ఏవిధంగానూ నష్టం కలిగించకూడదన్నదే భారత రాజ్యాంగ స్ఫూర్తని తెలిపారు.

*
మన్‌కీబాతున మోదీ
జనుల మనసులోని మాట జనగణమనగా
వీనులవిందుగ జెప్పగ
జనులందరు వందనమిడి మాతరమనరే!