జాతీయ వార్తలు

సహించం.. ఉపేక్షించం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, నవంబర్ 26: ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని యావద్భారతం ముక్తకంఠంతో ఉద్ఘాటించింది. తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున ముంబయిపై ఉగ్రమూకలు జరిపిన నరమేధంలో అసువులు బాసిన వారికి ఘన నివాళులర్పిస్తూ ఈ జాడ్యాన్ని కూకటివేళ్లతో పెకలించి వేస్తామని స్పష్టం చేసింది. ముంబయి, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేకచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రణన్నినాదాలే చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దక్షిణ ముంబయిలోని సంస్మరణ కేంద్రాన్ని సందర్శించి మృతులకు నివాళులర్పించారు.
తీరు మారని పాక్: రిజిజు
ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారతదేశం ఏవిధంగానూ ఉపేక్షించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం ఉద్ఘాటించారు. మొదట్నుంచీ భారతదేశం ఉగ్రవాద జాడ్యాన్ని అణచివేసే విషయంలో నిస్సహన వైఖరిని అవలంబిస్తోందని పునరుద్ఘాటించిన ఆయన ఉగ్రవాదానికి పాకిస్తాన్ మూలకేంద్రంగా మారిందన్న విషయాన్ని భారత్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. 26/11 ఉగ్రవాద దాడిలో మరణించిన వారి సంస్మరణార్థం ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన రిజిజు ఉగ్రవాద ధోరణులను ఏవిధంగానూ సహించేది లేదన్నారు. ముంబయి దాడికి సూత్రధారిగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ విడుదల గురించి ప్రస్తావించిన ఆయన ‘ఈ విషయం నాకు ఆందోళన కలిగిస్తోంది. ముంబయి దాడి వెనుక హఫీజ్ హస్తం ఉందని ఆధారాలతో సహా పాక్‌కు అందించినా అతడ్ని విడుదల చేయడం దిగ్భ్రాంతికరం’ అని తెలిపారు. పఠాన్‌కోట్ దాడి విషయంలో కూడా పాక్ వైఖరి ఇదే తరహాలో ఉందని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌వర్ధన్ రాథోడ్‌లు ముంబయి దాడి మృతులకు నివాళులర్పించారు. మూడు రోజులపాటు పాక్ మూకలు సాగించిన నరమేధంలో 164మంది పౌరులు మరణించారు. వీరిలో ఇద్దరు ఎన్‌ఎస్‌జి కమాండోలు, 18మంది పోలీసులు అధికారులు కూడా ఉన్నారని, 308మంది గాయపడ్డారని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. 26/11 బాధితులందరికీ నివాళులర్పిస్తున్నామని స్మృతి ఇరానీ అన్నారు.

చిత్రం..ముంబయిలోని కామా ఆసుపత్రి వద్ద 26/11 దాడుల్లో
మృతి చెందిన వారికి నివాళులర్పిస్తున్న బంధువులు