జాతీయ వార్తలు

తీరంపై రెప్పవాల్చని నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: 26/11 ముంబయి ఉగ్రదాడి నేపథ్యంలో, మరోసారి అటువంటి ప్రమాదం సంభవించకుండా దేశంలోని అనేక పోర్టుల రక్షణ సామర్థ్యంపై కేంద్రం దృష్టిపెట్టింది. 227 పోర్టుల్లోని భద్రతాంశాలపై సమీక్ష నిర్వహించిన కేంద్రం, పోర్టుల పటిష్టానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు అధికార్లు వెల్లడించారు. ముంబ యి దాడి జరిగి తొమ్మిదేళ్లయిన సందర్భంలో హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆ దుర్ఘటన నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నారు. తీరప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నామని, ఇస్రో శాటిలైట్ సాయంతో అనుమానిత పడవలు, బోట్లుపై గట్టి నిఘా పెట్టామని వివరించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు అనేక రేవుల్లోని భద్రతా లోపాలను సవరించామని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు విషయంలో కచ్చితమైన నిర్వహణా విధానాలు రూపొందించామని, ఈమేరకు 227 పోర్టుల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దేశంలో పనె్నండు ప్రధాన రేవు ప్రాం తాలైన కోల్‌కతా, హాల్దియా సహా కాండ్ల, ముంబయి, జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు, మార్ముగో, న్యూ మంగుళూ రు, కొచ్చిన్, వివో చిదంబరనార్, చెన్నై, కామరాజర్, పారాదీప్, విశాఖపట్నంలలో అదనపు రక్షణ చర్యలు ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. అధికారిక లెక్కల ప్రకారం భారత్‌లోని 95 శాతం వర్తకంలో 70 శాతం వర్తకం సముద్ర రవాణా ద్వారానే సాగుతోంది. 2015 లెక్కల ప్రకారం 1,052 మిలియన్ మెట్రిక్ టన్నుల సరు కు రవాణా అయితే, ఈ ఏడాది చివరి నాటికి అది 1,758 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తీరప్రాంత భద్రతను బలోపేతం చేసే క్రమం లో భారత రోదశి అధ్యయన కేంద్రం (ఇస్రో) సాయం తీసుకుంటూనే, ఉపరితల నిఘాలో భాగంగా అధునాతన పరికరాలతో అనేక రక్షణ బృందాలను రంగంలోకి దింపామని అధికారులు చెబుతున్నారు. ముంబయి ఘట న తరువాత ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నట్టు హోంశాఖ అధికారులు వెల్లడించారు.