జాతీయ వార్తలు

భారత్-రష్యా బంధం మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన ధ్యేయంగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మూడు రోజుల మాస్కో పర్యటన మొదలైంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు మాస్కోకు బయలుదేరిన రాజ్‌నాథ్‌సింగ్ అనేక ద్వైపాక్షిక అంశాలపై రష్యా నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం తదితర జాడ్యాలపై రష్యా హోంమంత్రిత్వ శాఖతో రాజ్‌నాథ్ విస్తృతంగా చర్చలు జరుపుతారని పేర్కొన్న అధికారులు ఇరు దేశాల మధ్య కుదిరే ఒప్పందాల ద్వారా ఉగ్రవాద, తదితర జాడ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం మార్చుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద నిరోధనకు సంబంధించి 1993 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందం స్థానే రాజ్‌నాథ్ పర్యటన సందర్భంగా మరో కీలక ఒప్పందం కుదరబోతోందని, దీనిద్వారా కొత్త సవాళ్లు, ఉగ్రవాద ముప్పులను మరింత పటిష్ఠంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలకు వీలు కలుగుతుందని హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. రష్యా ఆంతరంగిక వ్యవహారాల మంత్రి వ్లాదిమిర్ కొలో కోల్ట్‌సేవ్‌తో రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారని, అలాగే రష్యా సీనియర్ నాయకులతోనూ మంతనాలు సాగిస్తారని హోంశాఖ అధికారులు వెల్లడించారు.