జాతీయ వార్తలు

నవభారత ఆవిష్కరణకు ప్రేరణ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక స్తంభాలైన ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ పరస్పరం కలిసి పనిచేస్తూ నవభారత ఆవిష్కరణకు తోడ్పడాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం బలోపేతమవుతూనే దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చే నవ వ్యవస్థకు ప్రేరణ కావాలన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడిక్కడ మాట్లాడిన మోదీ ప్రస్తుత వ్యవస్థను గుణాత్మక రీతిలో ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై ఈ మూడు వ్యవస్థలు మరింతగా అంతర్మథనం చెందాల్సిన అవసరం ఉందన్నారు. పరస్పర లోపాలను ఎత్తిచూపుకునే బదులు ప్రజాస్వామ్యానికి మూలకందాలైన ఈ మూడు వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన రాజ్యాంగం దేశ సమగ్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించిందని, కాలపరీక్షకు నెగ్గి అన్ని సవాళ్లను అధిగమిస్తూ నిగ్గుతేలిందన్నారు.

చిత్రం..జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన
కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం