జాతీయ వార్తలు

‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల పొగ మంచు లాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వంపైనే నెట్టివేయలేమన్నారు. డబ్ల్యూడబ్ల్యూ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జరిగిన ‘క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ఇన్ ఇండియా’ కార్యక్రమంలో మిశ్రా మాట్లాడారు. ఢిల్లీలో తలెత్తుతున్న వాతావరణ పరిస్థితులకు ఒక్క విభాగానే్న బాధ్యుల్ని చేయలేమని అన్నారు. ప్రభుత్వం విఫలమైన పక్షంలో మరో విభాగం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మిశ్రా చెప్పారు. ప్రభుత్వం, పౌర సమాజం అలాగే అందరికీ బాధ్యత ఉందని పర్యావరణ అంశంపై మాట్లాడుతూ తెలిపారు. లక్ష్య సాధనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని మిశ్రా పిలుపునిచ్చారు. ‘్ఢల్లీలో ఇటీవల పొగమంచుతో తలెత్తిన వాతావరణ మార్పు వంటి సంఘటన పురావృతం కాకుండా చూడాల్సింది ప్రభుత్వం ఒక్కటే కాదు. ఇదొక్క రాజధాని ఢిల్లీకే కాదు, దేశమంతటా ఆ పరిస్థితి ఉంది’ అని అన్నారు.