జాతీయ వార్తలు

సుప్రీం కోర్టులో ఏపీకి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వివాదంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి స్పష్టత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. ఉన్నత విద్యా మండలి ఖాతాలు, ఆస్తుల పంపిణీ వివాదంలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందని, దీనిపై మరోసారి సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సోమవారంనాడు జస్టిస్ అరుణ్ మిశ్రా, సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తరపున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదనలు వినిపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని హోంశాఖ ఎటువంటి ఆదేశాలు జారీచేసిందో తమకు అనసరమని, గతంలో ఇచ్చిన తీర్పులో స్పష్టత ఇవ్వాల్సిన అంశం ఏమీలేదని వెల్లడించారు. ఈ అప్లికేషన్ల విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసన స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయదలుచుకుంటే, దానిపై వేరే విధంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని, ఈ పిటిషన్లు అందుకు అనుగుణంగా లేవని పేర్కొంది. ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదికి ధర్మాసనం అవకాశం కల్పించడంతో, ఆయన ఉపసంహరించుకున్నారు. 2016 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విద్యామండలి ఖాతాలు, ఆస్తుల వివాదం కేసులో ఏపీ విభజన చట్టం ప్రకారం జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని, లేనిపక్షంలో కేంద్రం ప్రభుత్వం ఒక కమిటీ వేసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనాభా నిష్పత్తిలో ఆస్తుల విభజనకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్రం హోంశాఖ ఒక కమిటీ వేసి ఆస్తులను భౌగోళిక ప్రాతిపాదికన ఏ ప్రాంతంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని, అదే విధంగా పంచుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఏపీ తరపున అడ్వికేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఉమ్మడి ఏపీ ఆస్తుల విభజనపై ఏపీకి సంబంధించిన ప్రతినిధులు బాలసుబ్రమణ్యం, ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు.