జాతీయ వార్తలు

లింగ నిష్పత్తి ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో స్ర్తి, పురుషుల నిష్పత్తి ప్రధాన సమస్యగా ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైద్యాధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పేదల పట్ల, సాయం అవసరమైన వారి పట్ల వైద్యులు సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు.
‘మన దేశం అనూహ్యమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తోంది.. దీనికి అనుగుణంగా ఆరోగ్యం, సామాజిక ప్రగతి సూచికలు ఉండాలి.. వ్యాధి నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి..’ అని రాష్టప్రతి పేర్కొన్నారు. క్షయ, మలేరియా, డెంగీ వంటి అంటువ్యాధులపై పోరాడాలని, అదే సమయంలో ఇతర వ్యాధుల నివారణకు కృషి జరగాలన్నారు. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థలో రెండో ఫౌండేషన్ కోర్సుకు హాజరైన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు తనను కలిసిన సందర్భంగా రాష్టప్రతి ఈ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆరోగ్యం ప్రధాన సమస్యగా మారిందని, సామాజిక- ఆర్థిక ప్రగతిలో ప్రజారోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోవింద్ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ, ఆధార్, మొబైల్ ఫోన్లు వంటి అధునాతన సౌకర్యాలతో వైద్యరంగంలో సేవలను పెంచాలని రాష్టప్రతి అన్నారు.

చిత్రం..రాష్టప్రతి భవన్‌లో వైద్యాధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రామ్‌నాథ్ కోవింద్