జాతీయ వార్తలు

సుప్రీం తీర్పును హర్షించిన హదియా తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: కేరళ లవ్ జిహాదీ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయాన్ని బాధిత మహిళ తండ్రి కెఎం అశోకన్ హర్షించారు. సుప్రీం కోర్టు తీర్పు తమకు ఎంతో ఊరట నిచ్చిందని మంగళవారం అతడు వ్యాఖ్యానించాడు. తన కుమార్తె హదియా మెడిసిన్ విద్యను అభ్యసించడానికి ధర్మాసనం అనుమతి ఇవ్వడంపై అశోకన్ ఆనందం వ్యక్తం చేశాడు. హదియాను గృహనిర్బంధం చేసినట్టు వచ్చిన ఆరోపణలను అతడు తీవ్రంగా ఖండించాడు. తన కుమార్తెకు ఎవర్నీ సంరక్షునిగా ఉండాలని బెంచ్ ఎక్కడా చెప్పలేదని షఫీన్ జహాన్‌కూడా ఇది వర్తిస్తుందని అశోకన్ తెలిపాడు. ఒకే మతం, ఒకడే దేవుడున్నది తమ విశ్వాసమన్నారు.