జాతీయ వార్తలు

ఎయిర్‌పోర్టులో కొట్టుకున్న మహిళలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరిలో ఒకరు మహిళా ప్రయాణికురాలు కాగా, మరొకరు ఎయిర్ ఇండియా డిప్యూటీ మేనేజర్ కావడం గమనార్హం. ఢిల్లీ నుంచి అహమ్మదాబాద్ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికురాలు టిక్కెట్ కౌంటర్ వద్ద ఎయిర్ ఇండియా డిప్యూటీ మేనేజర్‌గా విధి నిర్వహణలో ఉన్న మహిళపై చేయిచేసుకుంది. ఆ మహిళా ప్రయాణికురాలు ఉదయం 5 గంటలకు అహమ్మదాబాద్ వెళ్లాల్సిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానం బయలు దేరడానికి 75 నిమిషాల ముందు ఆమె ఎయిర్‌పోర్టుకు రావల్సి ఉండగా 40 నిమిషాల ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆమెను విమానం వద్దకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించలేదు. వెంటనే ఆ ప్రయాణికురాలు ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా డిప్యూటీ మేనేజర్‌పై చేయి చేసుకున్నారు. దీనికి ప్రతిగా ఆ డిప్యూటీ మేనేజర్ కూడా సదరు మహిళా ప్రయాణికురాలిని కొట్టారు. తర్వాత పరస్పరం క్షమాపణలు చెప్పుకోవడంతో గొడవ సద్దుమణిగింది. వాగ్యుద్ధం ఫలితంగా ఇద్దరు మహిళలూ పరస్పరం కొట్టుకున్నారని ఎయిర్ ఇండియా ఉద్యోగులు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని ఎయిర్ పోర్టు డిసిపి సంజయ్ భాటియా చెబుతూ, రాజీపడడంతో వివాదం ముగిసిందన్నారు. నిబంధనల ప్రకారం దేశీయ విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు 75 నిమిషాల ముందుగా, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లాల్సిన వారు 140 నిమిషాల ముందు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి.