జాతీయ వార్తలు

బీజేపీ విజయపతాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 1: ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అధికార బిజెపి దూసుకుపోతోంది. మేయర్ ఎన్నికల్లో పది స్థానాలను సొంతం చేసుకున్న బిజెపి మరో ఆరుచోట్ల కూడా ఆధిక్యతతో దూసుకుపోతోంది. అమేథీ సహా అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఫలితానే్న కనబరచింది. మాయావతి సారథ్యంలోని బిఎస్‌పి అభ్యర్థి అలీగఢ్ మేయర్ సీటును దక్కించుకుని అధినేత్రికి కొంత ఊరటనందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆ పదవిని చేపట్టిన తర్వాత ఓ పరీక్షగా మారిన ఈ ఎన్నికలు ఆయన నాయకత్వానికి మరింత పదును పెట్టాయి. అయోధ్య, వారణాసి, లక్నో, గోరఖ్‌పూర్ సహా పలు ప్రతిష్ఠాత్మక మేయర్ సీట్లను బిజెపి సొంతం చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయం చారిత్రకమని, ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న నిర్ణయాలకు ఇది తిరుగులేని గుర్తింపు అనీ ఆదిత్యనాథ్ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించాలన్న లక్ష్యం దిశగా బిజెపి పరుగులు పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు నిర్ణయాలకు యుపి స్థానిక ఎన్నికల ఫలితాలతో తిరుగులేని ఆమోదం లభించిందని ఆర్థికమంత్రి జైట్లీ అన్నారు. రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలోనే బిజెపి విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా దాని ఉపాధ్యక్షుడికి తీవ్ర విఘాతంగా చెబుతున్నారు.

*కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఇలాకాలో బీజేపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ విజయపతాక ఎగురవేశారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అధికార బిజెపి దూసుకుపోతోంది. మేయర్ ఎన్నికల్లో పది స్థానాలను సొంతం చేసుకుని, మరో ఆరుచోట్ల ఆధిక్యతలో ఉంది. అమేథీ సహా అన్ని స్థానాల్లోనూ బీజేపీ దూకుడు ప్రదర్శించటంతో, పార్టీశ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు స్వీట్లు తినిపిస్తున్న బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే.