జాతీయ వార్తలు

న్యాయ సమస్యా.. ఏఐని ఆశ్రయించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రపంచం మారిపోతోంది. వారాలు, నెలలు, సంవత్సరాలుపట్టే పనులు చిటికెలో, అదీ క్షణాల్లో తేలిపోయే సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఇటీవలికాలంలో కృత్రిమ మేథస్సు అన్నది అన్నిరంగాల్లో విస్తృతస్థాయి మార్పులకు వేదికవుతోంది. తాజాగా ఏఐగా పేర్కొనే ఈ కృత్రిమ మేథస్సును వినియోగించుకునే ఒక సాధనాన్ని రూపొందించారు. దీనివల్ల కలిగే ఉపయోగం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన దేశంలో కోర్టులన్నా, కేసులన్నా.. ఇది ఇప్పట్లో తేలేదికాదురా బాబూ అన్న ఆలోచనే ఎవరికైనా కలుగుతుంది. కానీ, ఈ కృత్రిమ మేథస్సు ఆధారిత ప్రకరణ ద్వారా కేవలం క్షణాల్లోనే ఏ కేసుకు సంబంధించిన వివరాలనైనా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. అంటే, నెలలుపట్టే కేసుల విచారణ పనిని ఈ ‘మేధో’ ఆధారిత ప్రకరణం క్షణాల్లో పూర్తి చేస్తుందన్న మాట. అంతేకాదు, ప్రతి దాన్నీ చూడాల్సిన అవసరం లేకుండా, వేలాది కేసు రికార్డులను పరిశీలించాల్సిన పనీ లేకుండానే.. ఆ పనంతా ఈ మేధో సాధనమే చేసేస్తుంది. మీరు పరిశీలిస్తున్న కేసుకు సంబంధించిన వివరాలను అందుబాటులోకి తెచ్చేస్తుంది. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా లెజిట్ క్వెస్ట్ అనే వెబ్‌సైట్ ఇటీవలే ప్రారంభమైంది. న్యాయ పరిశోధనకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింతగా జోడించే దిశగా ఈ వెబ్‌సైట్ పని చేస్తోంది. ఇందులో భాగంగానే కృత్రిమ మేధో సంపతి ఆధారంగా రూపొందించిన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొందరు అటార్నీలు, ఇంజనీర్లు, డిజైనర్ల సమష్టి కృషి ఫలితంగా ఈ యాప్ రూపొందింది. దీనికి ఐ సెర్చ్ అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా కృత్రిమ మేధో ప్రకరణ ఆధారంగానే పని చేస్తుంది. వందల, వేల ఫైళ్లను దానంతట అదే పరిశీలించి, పరిశీలనలో ఉన్న కేసుకు సంబంధించిన వివరాలను క్షణాల్లోనే కళ్లకు కడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. అలాగే, ఐ డ్రాఫ్ట్ అనే మరో ఫీచర్‌నూ ఇందులో భాగంగా రూపొందించారు. దీనివల్ల ఒక కేసు విశే్లషించేందుకు పట్టే సమయం కూడా గరిష్టస్థాయిలో తగ్గిపోతుంది. 1950 నుంచి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు అన్నింటినీ అందుబాటులోకి తేవడంతోపాటు, వాటికి సంబంధించిన అంశాలను, వాస్తవాలను, వాదనను, సహేతుకతను దీనిద్వారా వినియోగదారులు ఆకళింపు చేసుకునే అవకాశం ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. అలాగే, ఐ గ్రాఫిక్స్ అనే మరో ప్రకరణాన్నీ ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రకరణ లేదని, దీనివల్ల ఒక కేసును ఏవిధంగా విశే్లషించవచ్చన్న అంశాన్ని అవగతం చేసుకోవచ్చని చెబుతున్నారు.