జాతీయ వార్తలు

నేరాల్లో యూపీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2016 సంవత్సరంలో జరిగిన నేరాల చిట్టాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం హత్యలు, మహిళలపై జరిగిన దాడుల్లో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 4,889 హత్య కేసులు నమోదు కాగా 2,581 కేసులతో బిహార్ చివరిస్థానంలో నిలిచింది. యూపీలో మొత్తంమీద 49,262 కేసులో నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 32,513 కేసులు నమోదయ్యాయి. 2015తో పోల్చుకుంటే దేశవాప్తంగా నమోదైన అత్యాచార కేసుల సంఖ్య 2016లో 12.4 శాతం పెరిగి 38,947 కేసులు నమోదయ్యాయి. 2016లో మధ్యప్రదేశ్‌లో 4,882 అత్యాచార కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 4,816 కేసులు నమోదయ్యాయి. మహారాష్టల్రో 4,189 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తంమీద యూపీలో 9.5 శాతం నేరాలు నమోదు కాగా 8.9 శాతంతో మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉంది. మహారాష్టల్రో 8.8 శాతం, కేరళలో 8.7 శాతం కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తంమీద 32,71,262 మందిపై చార్జిషీట్లు నమోదయ్యాయి.