జాతీయ వార్తలు

సాక్ష్యాలివ్వకుండా అరెస్టా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: ముంబయి దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ మరింత దూకుడునే అవలంబిస్తోంది. అనేకమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న 26/11 కుట్రదారును చట్టప్రకారం శిక్షించాలంటూ భారత్ చేస్తున్న విజ్ఞప్తులను తిరస్కరిస్తూ వచ్చిన పాక్, ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది. హఫీజ్ సరుూద్‌ను జైల్లో పెట్టేది లేదని తెల్చిచెప్పిన పాక్ నాయకత్వం ‘ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఏమైనా ఉంటే అంతర్జాతీయ కోర్టుకెళ్లండి’ అంటూ భారత్‌కు సవాల్ విసిరింది. జమాత్ ఉద్ దవా నాయకుడైన హఫీజ్ సరుూద్‌ను లాహోర్ హైకోర్టు ఇటీవల విడుదల చేయడాన్ని పాకిస్తాన్ ప్రధాని షాహిద్ కాకన్ అబ్బాసీ గట్టిగా సమర్థించారు. సరుూద్‌పై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, వీటిపై భారత్ ఇంతవరకు సాక్ష్యాలనే అందించలేదని స్పష్టం చేశారు. భారత్ ఆరోపణల్లో పసవుంటే సరుూద్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లవచ్చని, కేవలం ఆరోపణలు, అభియోగాల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్య తీసుకునే ప్రసక్తి లేదని తెలిపారు. ఇప్పటి వరకూ 26/11 కుట్రదారుగా సరుూద్‌కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ఆధారాలనూ అందించలేదంటూ పాక్ ప్రధానిని ఉటంకిస్తూ డాన్ పత్రిక తెలిపింది. అంతేకాదు, భారత్ ఎలాంటి సాక్ష్యాధారాలూ అందించలేదని భారత్ విదేశాంగ ప్రతినిథి రవీష్‌కుమార్‌కు స్పష్టం చేసినప్పటికీ, ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదని కూడా పాక్ ప్రధాని పేర్కొనడం గమనార్హం. దాదాపు 200మందికి బలిగొన్న 2008 ముంబయి దాడి సూత్రధారి హఫీద్ సరుూదేనంటూ కొనే్నళ్లుగా భారత్ ఆరోపిస్తూనే ఉంది. అంతేకాకుండా సరుూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో భారత్ చేసిన ప్రయత్నాలను పాక్‌కు కొమ్ముకాస్తూ వస్తున్న చైనా అడ్డుకుంటూ వచ్చింది కూడా. మరోపక్క హఫీజ్ విడుదలను వ్యతిరేకించిన అమెరికా, తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్‌ను అమెరికా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్ వాదనను సవాల్ చేస్తూ ఆధారాలుంటే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లండని పాక్ ప్రధానే భారత్‌కు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది.