జాతీయ వార్తలు

ఒబామాతో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. జనవరి 1న అమెరికా అధ్యక్షుడిగా వైదొలగిన తర్వాత ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఒబామాను మళ్లీ కలుసుకునే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన నాయకత్వంలోని ఫౌండేషన్ చేపడుతున్న చర్యల గురించి తెలుసుకునే అవకాశం కలిగిందని మోదీ ట్వీట్ చేశారు. అలాగే భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి కూడా ఒబామా ఆలోచనల గురించి తాను తెలుసుకోగలిగానన్నారు. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన కాలంలో ఒబామా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోనూ, ప్రధాని నరేంద్ర మోదీతోనూ అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. మోదీ ఆహ్వానం మేరకు 2015 జనవరిలో జరిగిన భారత రిపబ్లిక్ దినోత్సవానికి కూడా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు, అమెరికా అధ్యక్ష హోదాలో భారత్‌ను రెండుసార్లు సందర్శించిన తొలి వ్యక్తి కూడా ఒబామానే కావడం గమనార్హం. 2010లో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన భారత్ వచ్చారు.

*ఒకప్పటి ప్రధాని మన్మోహన్‌తోనే కాదు, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ స్నేహబంధం ఉందని ఆనందంగా ప్రకటించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కోసం భారత్‌కు వచ్చిన ఒబామా, శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి మైత్రీ బంధాన్ని గుర్తు చేసుకుంటున్నప్పటి చిత్రం