జాతీయ వార్తలు

శిక్షార్హ నేరం.. మూడేళ్ల శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1:అత్యంత కఠినమైన నిబంధనలతో ట్రిపుల్ తలాక్ చట్ట ముసాయిదా బిల్లుకు కేంద్రం రూపకల్పన చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణించడంతో పాటు అందుకు పాల్పడ్డ వారికి మూడేళ్ల కారాగార శిక్షనూ విధించే రీతిలో ముసాయిదాకు మెరుగులు దిద్దుతోంది. ముస్లిం మహిళల వెతలకు కారణమవుతున్న ఈ విధానాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిరోధక బిల్లును ముస్తాబు చేసి శుక్రవారం రాష్ట్రాల పరిశీలనకు పంపింది. పార్లమెంట్ ఉభయ సభలూ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రాల ధృవీకరణతో కేంద్రానికి నిమిత్తం లేకపోయినప్పటికీ ఇది కీలకమైన బిల్లు కాబట్టి రాష్ట్రాల అభిప్రాయాలనూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే వాటికి నివేదిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో ఏర్పాటయిన అంతర్ మంత్రిత్వ బృందం ఈ ముసాయిదాను రూపొందించింది. ఈ గ్రూపులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్త నుంచి పిల్లల సంరక్షణతో పాటు భృతిని కోరుతూ ఓ మెజిస్ట్రేట్‌ను కలిసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అలాగే వౌఖికంగా, లిఖిత పూర్వకంగా, ఈమెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్. వాట్సప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని ఈ ముసాయిదా బిల్లు నిషేధిస్తోంది. తలాక్ అక్రమమని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చిన తర్వాత కూడా బాధిత ముస్లిం మహిళల నుంచి కేంద్రానికి 67 ఫిర్యాదులు వచ్చాయి. తగిన చట్టం లేకపోవడం వల్ల తమ ఫిర్యాదులు స్వీకరించేందుకూ పోలీసులు నిరాకరిస్తున్నారని బాధిత ముస్లిం మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. గృహ హింస చట్ట నిబంధనలు కూడా ఇలాంటి కేసుల్లో ఏ విధంగానూ ఉపయోగ పడటం లేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.