జాతీయ వార్తలు

బతికుండగానే చంపేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: డబ్బులకు కక్కుర్తిపడి పేషెంట్ చనిపోయినా వైద్యం అందిస్తున్నట్టు నటించే ఆసుపత్రి యాజమాన్యాల గురించి నిత్యం పేపర్లలో చదువుతూ ఉంటాం. జబ్బుపడ్డ అవయవం బదులు మరోదానికి శస్తచ్రికిత్స చేసిన ఘనులనూ చూశాం. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి వీటన్నింటినీ తిరగరాసింది. ఆసుపత్రిలో పుట్టిన కవలలు చనిపోయారని ప్రకటించేశారు. తీరా చూస్తే జంటలో ఓ చిన్నారి ప్రాణంతోనే ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. షాలిమార్ మ్యాక్స్ ఆసుపత్రి వైద్యుల ఘనకార్యం అలా ఉంది.
ఓ తల్లి ఆసుపత్రిలో కవలలను ప్రసవించింది. అయితే పిల్లలిద్దరూ చనిపోయారని ధ్రువీకరించేసిన మ్యాక్స్ ఆసుపత్రి అధికారులు ఓ ప్లాస్టిక్ కవర్లోవేసి జంటను కుటుంబ సభ్యులకు అందజేశారు. పుట్టెడు దుఖాఃన్ని దిగిమింగుతూ కవర్ తీసుకుని ఇంటికి చేరుకున్నారు. మ్యాక్స్ వైద్యులు ఇచ్చిన కవర్ చూడగా కవలల్లో ఒకరు కొన ఊపిరితోనే ఉన్నారు. ఖిన్నులైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. మ్యాక్స్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించింది. కేంద్ర వైద్య మంత్రి జెపి నడ్డా వైద్య ఆరోగ్య కార్యదర్శితో మాట్లాడారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై మంత్రి ఆరాతీసి, నివేదికకు ఆదేశించారు. ‘అంత్యంత దారుణమైన సంఘటన ఇది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అలాగే న్యాయనిపుణులతో మాట్లాడాం. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్‌ను నివేదిక అడిగాం’ అని అధికార ప్రతినిధి దీపేంద్ర పథక్ వెల్లడించారు.