జాతీయ వార్తలు

మీ సమాధానం ఏమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు పదవుల్లో కొనసాగుతున్నారని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పిల్ విచారణకు స్వీకరించింది. 1951 ప్రజాప్రయోజన ప్రాతినిధ్య చట్టంలోని 29ఏ సెక్షన్ చెల్లుబాటుపై విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. తీవ్రమైన కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయ పార్టీల్లో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని, ఇది ప్రజాప్రయోజన ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమంటూ న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటునే ఎన్నికల్లో గెలిచి ఉన్నత పదవుల్లో సైతం కొనసాగుతున్నారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. నేర రహిత రాజకీయాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కొనసాగకుండా ఉండేలా ఇసి, కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కుమార్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. అనేక మంది నాయకులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని అయినప్పటికీ పార్టీల్లో కీలక పదవులు అనుభవిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. హత్య, అత్యాచారం, స్మగ్లింగ్, మనీలాండరింగ్, దోపిడీలు, దేశద్రోహం, డెకాయిట్ వంటి కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయినవారూ పదవులు అనుభవిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.