జాతీయ వార్తలు

ట్రంప్‌కు చురక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఒబామా వాక్చాతుర్యం గురించి పరోక్షంగా ఆయన వేసిన చురకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన మాటలు లక్షిత వ్యక్తికి సూటిగా తగిలేలా మాట్లాడటంలో ఆయన దిట్ట. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ట్వీట్ల ప్రస్తావన వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న ఓబామా సోషల్ మీడియా గురించీ మాట్లాడారు. ‘నాకు పది కోట్ల మంది ట్విట్టర్ అభిమానులు ఉన్నారు. ఈ సంఖ్య ట్వీట్‌ను భారీగా ఉపయోగిస్తున్న వ్యక్తికంటే చాలా చాలా ఎక్కువ’ అని పేర్కొన్నారు. అంటే, అన్యాపదేశంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించారు. ప్రస్తుతం ట్రంప్‌కు 44 మిలియన్ మంది ట్వీట్ ఫాలోవర్లు మాత్రమే ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. పారిస్ ఒప్పందం విషయంలోనూ ట్రంప్ అనుసరించిన విధానాన్ని పరోక్షంగా దుయ్యబట్టారు. అయితే, ట్వీట్లకు సంబంధించి స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని ఒబామా ఈ సందర్భంగా సలహా ఇచ్చారు.
మన్మోహన్ సహకారం మరువలేను
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా స్నేహం గురించి ఎన్నో కథలు, కథనాలు వచ్చాయి. కేంబ్రిడ్జిలో శిక్షణ పొందిన ఆర్థికవేత్తగా భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ను తన అధ్యక్ష హయాంలో ఒబామా ఎంతగానో అభిమానించారు. కీలక అంశాలపై ఆయన సలహాలూ తీసుకున్నారు. ఇదే అంశాన్ని తాజాగా ప్రస్తావించిన ఒబామా, 2009లో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకున్నపుడు అప్పటి భారత ప్రధానిగా మన్మోహన్ ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. గతంలో అనేకసార్లు మన్మోహన్ గురించి ప్రశంసాపూర్వంగా ఒబామా మాట్లాడిన విషయం తెలిసిందే. ‘మన్మోహన్ మాట్లాడటం మొదలెడితే ప్రతి ఒక్కరూ సావధానంతో వింటారు’ అని 2010 జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఒబామా పేర్కొన్న విషయం తెలిసిందే. మన్మోహన్‌తోపాటు తనకు ప్రస్తుత ప్రధాని మోదీతో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి కొంచెంసేపు ఆగిన ఒబామా ‘నాకు మోదీతోనే కాదు, మన్మోహన్ సింగ్‌తో కూడా మంచి స్నేహం ఉంది. నేను మోదీని ఇష్టపడతాను. ఎందుకంటే, భారత్ కోసం ఆయన ఎంతో చేస్తున్నారు. పాలనకూ పదును పెడుతున్నారు’ అని తెలిపారు.