జాతీయ వార్తలు

రబ్రీదేవిని ప్రశ్నించిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, డిసెంబర్ 2: బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. రైల్వే హోటళ్ల కేటాయింపుల్లో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో ఈడీ ఆమెను ప్రశ్నించింది. ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి పాట్నాలోని ఈడీ జోనల్ ఆఫీసుకు మధ్యాహ్నం వచ్చారు. ‘్ఢల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక బృందం రబ్రీదేవిని ప్రశ్నించింది. మనీలాండరింగ్ కింద దాఖలైన కేసులో ఆమెను ఆరు గంటల సేపు ప్రశ్నించారు. మొత్తం రికార్డు చేశారు’ అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పుడు చోటుచేసుకున్న అవినీతి కేసులో ఆయన సతీమణి రబ్రీదేవికి ఈడీ ఆరుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఒక్కసారి కూడా ఈడీ అధికారుల ఎదుట హాజరుకాలేదు. పాట్నా వస్తేనే విచారణకు హాజరవుతానని ఆమె షరతు పెట్టారు. దీంతో ఈడీ పాట్నాకు రాక తప్పలేదు. శనివారం పాట్నా జోనల్ ఆఫీసులో రబ్రీదేవిని ప్రశ్నించింది. ఇంతకు ముందే లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ఈడీ రెండుసార్లు ప్రశ్నించింది. లాలూ కుటుంబ సభ్యులు మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు.

చిత్రం..శనివారం పాట్నాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై వెలుపలకు వస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె, ఎంపీ మీసా భారతి