జాతీయ వార్తలు

అంతర్జాతీయ నావికా సంస్థకు భారత్ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అంతర్జాతీయ నావికా సంస్థ (ఐఎంఓ) కౌన్సిల్‌కు మరోసారి భారత్ ఎంపికయింది. దీనిద్వారా ఐఎంఓ కౌన్సిల్‌లో రెండేళ్లపాటు భారత్ కొనసాగనుంది. ఈ కౌన్సిల్ ప్రతినిధిగా బ్రిటన్ హైకమిషనర్ వైకే సిన్హా వ్యవహరిస్తారు. కౌన్సిల్‌లో జర్మనీ తరువాత అత్యధిక ఓట్లు భారత్‌కు లభించాయి. జర్మనీ 146, భారత్ 144, ఆస్ట్రేలియా 143 ఓట్లు సాధించాయ. ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, యూఏఈ, కెనడా, బ్రెజిల్, స్వీడన్ దేశాలు కూడా ఈ కౌన్సిల్‌కు ఎంపికయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల నౌకాయాన వ్యాపారంలో విస్తృత ప్రయోజనాలు కలిగివున్న దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటాగిరి-బికి భారత్ ఎంపికయింది. ఐఎంఓలో 1959 నుంచి సభ్యదేశంగా ఉన్న భారత్ 1938-84 సంవత్సరాలకు మినహా, ప్రతిసారీ ఐఎంఓ కౌన్సిల్‌కు ఎంపికవుతూనే వుంది. నౌకా వ్యాపారానికి సంబంధించి తమ పరిధిలో ఉన్న కీలక అంశాలపై ఐఎంఓ నిర్ణయాలు తీసుకుంటుంది.