జాతీయ వార్తలు

నిజ నిర్ధారణ జరగకుండా ఎవ్వరినీ శిక్షించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: ఆయుధాల వ్యాపా రి సంజయ్ భండారితో తన ఓఎస్‌డి అప్పారావు టెలిఫోన్‌లో వందాలాదిసార్లు సంభాషించినట్లు వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలు తెలుసుకుంటానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. అశోక్ గజపతిరాజు గురువారం విలేఖరులతో మాట్లాడుతూ నిజ నిర్ధారణ జరగకుండా ఎవ్వరినీ శిక్షించలేమన్నారు. సంజయ్ భండారి తనను కూడా ఒకసారి కలిశారని, ఎయిరోస్పేస్ పరిశ్రమతో సంబంధం ఉన్నవారంతా తనను కలుస్తుంటారు, సంజయ్ భండారీ కూడా ఇదే తరహలో తనను కలిశారు, బెంగళూరులో సంవత్సరం క్రితం ఎయిర్ షోలో కలిశారని ఆయన వివరించారు. అప్పారావుపై ఏవైనా అవినీతి ఆరోపణలు వస్తే చెప్పండి, అదేదీ లేకుండా చర్య తీసుకోమనటం సమంజసం కాదని అశోక్ గజపతిరాజు చెప్పారు. నాపై ఏవైనా ఆరోపణలు ఉంటే చెప్పండి సమాధానం ఇస్తాను, నా సిబ్బందిపై ఏవైనా ఆరోపణలుంటే చెప్పండి తెలుసుకుంటానని ఆయన అన్నారు. సంజయ్ భండారీ నుండి అప్పారావుకు వందలాది కాల్స్ వచ్చాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి, వీటి నిజానిజాలు తెలుసుకుంటానని అన్నారు. ఏదేమైనా తన సిబ్బంది తప్పుచేస్తే దానికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. అప్పారావు వ్యవహారాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇక్కడ కొనసాగటం మంచిదా? అని ఒక విలేఖరి అడుగగా, ఆరోపణల నిగ్గు తేలవలసి ఉన్నదని ఆయన బదులిచ్చారు. అప్పారావుకు భండారీ నుండి వందలాది ఫోన్ కాల్స్ వచ్చాయనేది ఆరోపణ తప్ప అవినీతి కాదు కదా? అని అశోక్ గజపతిరాజు ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంజయ్ భండారితో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు చూశాను, అయితే వాద్రా వ్యవహారాలపట్ల తనకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. విచారణ జరిగేంతవరకు అప్పారావును పక్కన పెడతారా? అని అడగ్గా, అప్పారావుపై విశ్వాసం ఉన్నది కాబట్టే ఓఎస్‌డిగా నియమించుకున్నానని తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని ఏదైనా తప్పు జరిగినట్లు తెలిస్తే ఏం చేయాలనేది అలోచిస్తామని ఆయన చెప్పారు. బెంగళూరు ఎయిర్‌షోలో భండారీ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు, ఆ స్టాల్‌లో పక్షులను పంపించి వేసే రాడార్ చూపించారని మంత్రి వివరించారు. భండారీకి మేలు చేశారా అని ఒక విలేఖరి అడుగగా ఏం మేలు చేస్తామిందులో అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. మీరెంతో విశ్వసనీయులు, మీ వద్ద ఇలాంటి అనుమానాస్పదులు ఉండటం మంచిదా అని అడుగగా, ఒక నిర్ణయానికి వచ్చి ప్రశ్న అడగటం మంచిదా అని అశోక గజపతిరాజు ప్రశ్నించారు.

చిత్రం విలేఖరులతో మాట్లాడుతున్నకేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు