జాతీయ వార్తలు

ఉగ్ర సముద్రుడు... జాడలేని జాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి: ఆగ్నేయ అరేబియా సముద్రంలో పెనుతుపానుగా మారిన ఓఖీ కల్లోలాన్ని సృష్టిస్తోంది. తుపాను తాకిడికి సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. కనీవినీ ఎరుగని రీతిలో అలలు పెను బీభత్సానే్న సృష్టిస్తున్నాయి. అలల ఉధృతాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లలో కొంతమందిని రక్షించిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మరికొందరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కల్పేని తీరం నుంచి ఎనిమిది పడవుల్లో 36మంది జాలర్లు చేపల వేటకు తుపానులో చిక్కుకుపోయారు. వీరి జాడ కోసం నావికా దళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. తిరువనంతపురంలోని విజిన్‌జమ్, కొల్లాం తీర ప్రాంతంలో ఐఎన్‌ఎస్ సాగర్‌ధ్వని కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటోంది. లక్షద్వీప్‌లో ఐఎన్‌ఎస్ శార్దూల్, ఐఎన్‌ఎస్ శారద జాలర్ల జాడ కోసం ప్రయత్నిస్తున్నట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తిరువనంతపురం తీరంలో 15మంది జాలర్లను రక్షించినట్లు ఆయన తెలిపారు.

చిత్రం..కేరళలోని కోచి తీరంలో జనావాసాలపైకి దూసుకొస్తున్న కెరటాలకు అడ్డుకట్ట వేస్తున్న దృశ్యం