జాతీయ వార్తలు

పీడీపీ అధ్యక్షురాలిగా మెహబూబా మళ్లీ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, డిసెంబర్ 2: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా ముఫ్తీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆమె మరో మూడేళ్లపాటు కొనసాగుతారు. పీడీపీ అధ్యక్షురాలిగా మెహబూబా 6వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై నమ్మకముంచి మళ్లీ అధ్యక్షురాలిగా గెలిపించినందుకు పార్టీ కార్యకర్తలకు మెహబూబా కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని మెహబూబా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 57 ఏళ్ల మెబబూబా లాలో గ్రాడ్యుయేట్‌ను పూర్తి చేశారు. ఆయన తండ్రి ముఫ్తీ మహ్మద్ సరుూద్‌తో కలిసి 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితానికి నాంది పలికారు. అనంతరం 1999లో ముఫ్తీ పీడీపీ పార్టీని ఏర్పాటు చేశారు. జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న మెహబూబా పీడీపీ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం పట్ల మంత్రివర్గ సహచరులు, పార్టీ కార్యకర్తలు ఆమె నివాసానికి తరలివచ్చి అభినందనలు తెలిపారు.