జాతీయ వార్తలు

రిగ్గింగ్ వారికి రివాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేంద్రనగర్ (గుజరాత్), డిసెంబర్ 3: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సంస్థాగత ఎన్నికల్లో కూడా రిగ్గింగ్‌కు పాల్పడిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనంటూ ఎద్దేవా చేశారు.
సాధారణంగా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ జరిగిన తర్వాతనే ఎన్నికల ఫలితం వెల్లడి కావాల్సి ఉంటుందని, కాని కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ పార్టీ కాబోయే అధ్యక్షుడెవరో ముందుగానే తేలిపోయిందంటూ వ్యంగ్యోక్తి విసిరారు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన మోదీ ‘సొంత పార్టీలోనే ప్రజాస్వామ్య విధానాలను అవలంబించనప్పుడు దేశంలో ప్రజాస్వామ్య విలువలను మీరేవిధంగా కాపాడగలుగుతారు’ అని మోదీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నికలు జరుగుతున్నాయి, వాటి ఫలితమేమిటో మీ అందరికీ ముందే తెలుసు’ అని మోదీ అన్నప్పుడు జనంలో హర్షధ్వానాలు చెలరేగాయి. మోదీ ప్రశ్నకు జవాబిచ్చిన ప్రజలు పార్టీ అధ్యక్ష పదవి రాహుల్ గాంధీకే దక్కుతుందంటూ జవాబిచ్చారు కూడా. జనంలో ఉన్న ఉత్సాహాన్ని అందిపుచ్చుకున్న మోదీ మరింత ముందుకెళ్లా, మొదట్నుంచీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు ఈ తరహాలోనే జరుగుతున్నాయని అన్నా రు. దేశ ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్న పరిస్థితి వచ్చినప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ కంటే కూడా సర్దార్ పటేల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తుచేసిన మోదీ, ‘ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. పటేల్ ఓడిపోయారు. నెహ్రూయే గెలిచారు’ అని ఆరోపించారు. మురార్జీ దేశాయ్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని పేర్కొన్న మోదీ మొదట్నుంచీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఘనమైన రిగ్గింగ్ చరిత్రే ఉందని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు షెహజాద్ పూనేవాలా పేరును ప్రస్తావించిన మోదీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియలో రిగ్గింగ్ విధానాన్ని ఆయన వెలుగులోకి తెచ్చారని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు సహనమే మంత్రంగా కాంగ్రెస్ పార్టీ దానిని దాటుకుంటూ వచ్చిందని, ఆ విధంగా పూనేవాలా నోరు మూయించిందని అన్నారు. అంతేగాకుండా, అన్ని వాట్సప్ గ్రూపుల ద్వారా పూనేవాలాకు నిద్రలేకుండా చేశారని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనను ఏకంగా పార్టీయే బహిష్కరించిందని మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, ‘బావిలో నీళ్లున్నపుడే బకెట్ నిండుతుంది. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు దేశంలో ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా ఆచరించగలుగుతారు’ అని కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. 182 స్థానాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి ఈ నెల 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
బరూస్‌లో జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ, కుల మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అన్నదమ్ముల మధ్యే గోడలు కట్టాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీపై చెలరేగిన మోదీ ఆ పార్టీ ఉద్దేశాల గురించి గుజరాత్ ప్రజలకు బాగానే తెలుసునన్నారు. అవసరానుగుణంగా రంగు మార్చడం అన్నది కాంగ్రెస్ పార్టీ నైజమని అన్నారు. వ్యూహాత్మకంగా సమాజాన్ని చీల్చి ఎన్నికల్లో లబ్ధి పొందడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమంటూ మోదీ విరుచుకుపడ్డారు.

చిత్రం..గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని సత్కరిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు