జాతీయ వార్తలు

శాంతి-ఉగ్రవాదం పొసగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, డిసెంబర్ 3: పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేస్తున్న వాదనను బీజేపీ తిరస్కరించింది. భారత్‌లోనూ, సరిహద్దుల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాక్‌తో శాంతి చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ‘ఒకపక్క ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశంతో శాంతి చర్చలు ఏవిధంగానూ పొసగవు’ అని కాశ్మీర్ బీజేపీ ప్రతినిధి అనిల్ గుప్తా స్పష్టం చేశారు. అయితే శాంతి చర్చలకు భారత్ సిద్ధంగా ఉన్నా అందుకు విముఖంగా ఉన్నది పాకిస్తానేనన్న వాస్తవం తెలిసినా ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రతిపాదన చేయడం ఎంతమాత్రం సహేతుకం కాదని ఆయన అన్నారు.