జాతీయ వార్తలు

దివ్యాంగ సేవకులకు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దివ్యాంగులకు సేవలు అందించిన పలుపురు వ్యక్తులు, సంస్థలకు జాతీయ దివ్యాంగ పురస్కారాలు అందజేశారు. జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. దివ్యాంగుల ఉపాధి అవకాశాలకోసం కృషి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యూత్ జాబ్స్ ఫౌండేషన్‌కు, సిక్రింద్రాబాద్‌కు చెందిన దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థలకు పురస్కరాలు దక్కాయి. దేవ్నార్ వ్యవస్థాపకుడు సాయిబాబా గౌడ్ అవార్డును అందుకున్నారు. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన కేవి శిరీష, కరీంనగర్ జిల్లా చిర్తకుంటకు చెందిన సి.సాయికృష్ణకు అవార్డులు లభించాయి. రోల్ మోడల్ అవార్డుల విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన కె.శేషగిరిరావు, ఆదిలాబాద్‌కు చెందిన ఆకుల రోహిత్‌కు అవార్డులు దక్కాయి. దివ్యాగులకు అనుకులంగా ఉండే విధంగా పరిసరాలను తీర్చిదిద్దిన శ్రీకాకుళం సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారికి కూడా అవార్డు లభించింది. దివ్యాంగులకు అవసరమైన పరికరాలకోసం పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన బిశ్వజిత్‌రాయ్, ఆశ దాస్, విజయకుమార్ అలీషాలకు కూడా పురస్కారాలు లభించాయి. దివ్యాంగుల సంక్షేమ అవార్డును ఈ ఏడాదికి మెడ్ ఇండియా వ్యవస్థాపకుడు, తమిళనాడుకు చెందిన పద్మశ్రీ డా. టీఎస్ చంద్రశేఖర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థవర్‌చంద్ గెహ్లాట్ పాల్గొన్నారు.