జాతీయ వార్తలు

భూగర్భాన్ని తోడేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అవిశ్రాంతంగా వీటిని వినియోగించడంవల్ల తీవ్రస్థాయిలోనే నీటి ఎద్దడి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని తాజాగావెలుగుచూసిన వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి. ఉపరితల జలాలపై కాకుండా దేశవ్యాప్తంగా రైతాంగం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారని, అదే విధంగా భూగర్భ జలాల వినియోగంపై ఆధారపడ్డ పథకాల సంఖ్య కూడా 2006-14 మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండాలంటే రైతుల వినియోగానికి ఉపరితల జలాలను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాలను విస్తృతం చేయాలని స్పష్టం చేసింది. ఉపరితల జలాల వినియోగానికి సంబంధించిన పథకాల కంటేకూడా గొట్టపు బావుల వంటి భూగర్భ జలాల వినియోగ పథకాలు భారీగా పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. జాతీయ స్థాయిలో భూగర్భ జలాలకు సంబంధించిన పథకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అదే క్రమంలో ఉపరితల జల వినియోగ పథకాలు తగ్గుముఖం పట్టినట్టుగా తెలిపింది. దీనినిబట్టి రైతులు పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడి తమ వ్యవసాయ అవసరాలు తీర్చుకుంటున్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది. ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ పథకాల విషయంలో భూగర్భ జలాలపైనే రైతులు ఆధారపడ్డారని వెల్లడించింది. ఇందుకు కారణం- మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడమేనని వెల్లడించింది. 2006-07 సంవత్సరంలో 21 మిలియన్ల మైనర్ ఇరిగేషన్ నిర్మాణాలుంటే 2013-14 నాటికి వీటి సంఖ్య 21.7 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక స్థాయిలో 38లక్షల మైనర్ ఇరిగేషన్ పథకాలు అమలవుతున్నాయని, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో తమిళనాడు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న మైనర్ ఇరిగేషన్ పథకాల్లో 50 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని వివరించింది. 33 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 రాష్ట్రాల్లో పది లక్షలకు పైగా మైనర్ ఇరిగేషన్ పథకాలు అమలవుతున్నాయని, ఎనిమిది రాష్ట్రాల్లో లక్ష నుంచి పది లక్షలకు వరకు వీటి సంఖ్య ఉందని తెలిపింది. మిగిలిన 15 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షకంటే తక్కువగానే మైనర్ ఇరిగేషన్ పథకాలు అమలవుతున్నాయని తెలిపింది.