జాతీయ వార్తలు

మరో గ‘ఘ’న యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. విశ్వసౌధంలో సంపన్న దేశాలకు చెందిన పరిశోధనా సంస్థలతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఇస్రో చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. అనతికాలంలోనే అంతరిక్ష పరిశోధనల్లో నిరుపమాన స్థాయికి చేరుకున్న ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల్లోనూ, అలాగే మార్స్ మిషన్ ద్వారానూ తన సత్తాను చాటుకుంది. తాజాగా మరో చారిత్రక అడుగు వేయబోతోంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపైనే అడుగుపెట్టేందుకు సన్నద్ధం అవుతోంది. 2013లో యూ-2 రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి చైనా విజయవంతంగా ప్రయోగించగలిగింది. ఇప్పుడు ఇస్రో కూడా 2018 మార్చి చివరి నాటికి మొట్టమొదటి లూనార్ రోవర్‌ను చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. చంద్రగ్రహ శోధన విషయంలో భారత్ చేపట్టిన తొలి అడుగు ఇదే కానప్పటికీ చంద్రుడ్ని అన్ని కోణాల్లోనూ పరిశోధించి అక్కడి పరిస్థితులను కరతలామలకం చేసుకునే దిశగా వేయబోతున్న బలమైన అడుగుగానే ఈ తాజా ప్రయోగ సంకల్పాన్ని పరిగణించాల్సి ఉంటుంది. 2008లో ఇస్రో తొలిసారిగా చంద్రయాన్-1ను ప్రయోగించింది. ఈ రోవర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమించి అక్కడి నీటి ఆనవాళ్లతోపాటు ఎన్నో కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చింది. అయితే 2008 నవంబర్‌లో ఈ వ్యోమనౌక చంద్రుడిని ఢీకొని దాని పరిభ్రమణలో గల్లంతయింది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయత్నం ఫలితంగా గత ఏడాది ఇది మళ్లీ కనిపించింది. తాజాగా మూడు వ్యోమనౌకలను చంద్రయాన్‌లో భాగంగా ఇస్రో బృందం సిద్ధం చేస్తోంది. వీటిలో ఒకటి చంద్రుడి ఉపరితల కక్ష్యలో తిరిగే ఆర్బిటర్ కాగా, రెండోది మూన్‌లాండర్. దీని ద్వారా ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగగలుగుతుంది.