జాతీయ వార్తలు

ప్రైవేటు విమానాల్లో వెళ్లొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లీవ్ ట్రావెల్ కనె్సషన్(ఎల్‌టిసి) నిబంధనలు మార్చారు. జమ్మూకాశ్మీర్‌కు ఇక నుంచి ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో వెళ్లొచ్చు. ఇంతకు ముందు ఈ వెసులుబాటులేదు. ఒక్క ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తేనే ఎల్‌టిసి వర్తించేది. ఇప్పుడా నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఎయిర్స్‌లైన్స్‌లో ప్రయాణించవచ్చని ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ వెళ్లొచ్చు. ప్రత్యేక మినహాయింపుపథకం కింద ఇంతకు ముందు ఎల్‌టిసిపై జమ్మూకాశ్మీర్ వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పథకం 2015 నవంబర్ 27తేదీతో ముగియగా, ఈఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించారు. ఈమేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాసులో ప్రయాణం చేస్తేనే ఎల్‌టిసి వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టిసి కింద రానూ పోనూ చార్జీలు ఇస్తారు.