జాతీయ వార్తలు

మాటలే తప్ప.. చేతలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రధాని నరేంద్ర మోదీ కేవలం వాగ్దానాలతోనే కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. గుజరాత్‌లో మహిళలకు భద్రత లేదని పేర్కొన్న ఆయన రోజుకో ప్రశ్న కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐదో ప్రశ్నను మోదీని లక్ష్యించి సంధించారు. గుజరాత్‌లో మహిళల భద్రత అన్నది ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న రాహుల్ గాంధీ, తన ప్రశ్నలకు మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని రాహుల్ ధ్వజమెత్తారు. గుజరాత్ మహిళలకు భద్రతా లేదు, అక్షరాస్యత లేదు, కనీసం వారి ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారం కూడా అందుబాటులో లేదని రాహుల్ ట్వీట్ చేశారు.
ఈ మహిళా శక్తిని ప్రభుత్వం దోపిడీ చేస్తోంది తప్ప వారి రక్షణ, భద్రతకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అన్నారు. అంగన్‌వాడీల నుంచి ఆశా కార్మికుల వరకు ప్రతి మహిళలోనూ నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయని పేర్కొన్న రాహుల్ ‘గుజరాత్ మహిళల సంక్షేమం విషయంలో మోదీ సర్కార్ హామీలతోనే కాలక్షేపం చేస్తోంది. వాటిని అమలు చేయాలనే ఉద్దేశం దానికి ఎంతమాత్రం లేదు’ అని అన్నారు. మహిళల భద్రత విద్య ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళల అక్రమ రవాణాలో మూడో స్థానంలో, యాసిడ్ దాడుల్లో ఐదో స్థానంలో, మైనర్ బాలికలపై అత్యాచారాల్లో గుజరాత్ పదో స్థానంలోఉందని పేర్కొన్న రాహుల్, దీన్నిబట్టి రాష్ట్ర మహిళల సంక్షేమాన్ని మోదీ సర్కార్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. బాలిక విద్య విషయంలో గుజరాత్ 20వ స్థానంలో ఉందని, 2001-11 మధ్య కాలంలో మహిళల అక్షరాస్యత 70.3 శాతం నుంచి 57.8 శాతానికి ఎందుకు పడిపోయిందని మోది ప్రశ్నించారు. అలాగే ప్రసవ సమయంలో మహిళల మరణాల రేటు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలు, విద్యా సంస్థలను పణంగా పెట్టి ప్రధాని మోదీ విద్యా వ్యాపారాన్ని మొదలుపెట్టారని రాహుల్ తీవ్రస్వరంతో ఆరోపించారు. భారీగా ఫీజులు పెంచి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారన్నారు. గత 22 సంవత్సరాలుగా గుజరాత్ బీజేపీ పాలనలోనే ఉందని, రాష్ట్రం అన్ని విధాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై మోదీ సర్కార్ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.