జాతీయ వార్తలు

జనవరి 30 నుంచి బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 30 నుంచి ప్రారంభంకానున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత మొదటి వార్షిక బడ్జెట్ కాగా, ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుంది. ఈ మేరకు సాధరణ బడ్జెట్ వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 30 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదేరోజు లోక్‌సభ, రాజ్యసభ, ఉభయ సభలను ఉద్దేశించి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించనున్నారు. జనవరి 31న ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభ ముందు పెట్టనున్నారు. వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. గతంలో వార్షిక బడ్జెట్‌ను ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే సాంప్రదాయన్ని ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది వార్షిక బడ్జెట్‌ను ఏప్రిల్ 1నుంచి అమలులోకి తీసుకురావలన్న ఉద్దేశంతో కేంద్రం ఫిబ్రవరి మొదటి వారాంలోనే పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే కొత్త సంప్రాదాయానికి నాంది పలికింది. అలాగే గతంలో మాదిరి వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ వేర్వేరుగా కాకుండా వార్షిక బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపి సమర్పిస్తుంది. అయితే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై, వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనున్నాయి. ఈ పరిస్థితుల్లో శీతాకాల, సాధారణ బడ్జెట్ సమావేశాల మధ్య నెలరోజులు కూడా విరామం ఉండటం లేదు. 2018-19 ఏడాదికి కేంద్రం సమర్పించే ఈ సాధారణ బడ్జెట్‌తోనే ఎన్డీయే ప్రభుత్వం 2019 ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. 2019లో ఎన్నికల షెడ్యూల్ అమలులోకి వచ్చే పరిస్థితుల్లో పరిమిత కాలం అవసరమైన ప్రభుత్వం వ్యయంకోసం ఓట్-ఆన్- అకౌంట్ ఆమోదం పొందిన అనంతరం కొత్తగా వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం ప్రవేశపెడతుంది. 2014లో యూపీఏ కాలంలో ఓట్ ఆన్ అకౌంట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి ఫిబ్రవరి నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా, అనంతరం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే ఏడాది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించారు.